పెరిక కులస్తులు ఐక్యంగా ఉంటే అభివృద్ధి సులభమని, ఆ దిశగా తెలంగాణ పెరిక కుల పెద్దలు ఆలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. కాకతీయ యూనివర్సిటీ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన వీరయ్యను కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి సంగని మల్లేశ్వర్ తన ఇంటి వద్ద గురువారం ఏర్పాటు చేసిన మర్యాదపూర్వక
సమావేశంలో పెరిక కుల పెద్దలతో ఆయన మాట్లాడారు. సేవే ప్రధాన లక్ష్యంగా వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో జి ఓ లను తీసుకొచ్చి, ఎంతో మందికి మేలు చేస్తున్నానని, పెరిక కులస్తులకు కార్పొరేషన్ సాధనలో కూడా నా వంతుగా కృషి చేశానని, రాజకీయంగా ఎంతో చైతన్యం చెందిన పెరిక కులస్తులు ఐక్యంగా కొనసాగితే నా వంతుగా సహకరించి ప్రభుత్వం తరపునుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈ ఆత్మీయ సమావేశంలో తెలంగాణ పెరిక సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు చింతం లక్ష్మీనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆక రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి సాయిని నరేందర్, రాష్ట్ర నాయకులు అప్పని సతీష్, చింతం ప్రవీణ్ కుమార్, దిడ్డి ధనలక్ష్మి, ముడిదే వెంకటేశ్వర్లు, సందేశాని నరేష్, అచ్చె పరమేశ్వర్, బొల్ల వీరప్రసాద్, డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, బెడిదే అనిల్, బెడిదే వెంకన్న, దొంగరి శ్రీనివాస్, బోలుగొడ్డు శ్రీనివాస్, సంగని నాగార్జున, శ్రీరామ్ వీరయ్య తదితరులు పాల్గొని వీరయ్యకు శాలువాలు కప్పి సత్కరించారు.

