Headlines

గ్రామ గ్రామానికి రాజ్యాంగం ఐ ఎల్ పి ఎ లక్ష్యం -వరంగల్ కోర్టులో రాజ్యాంగ దినోత్సవం

గ్రామ గ్రామానికి రాజ్యాంగం ఐ ఎల్ పి ఎ లక్ష్యం

వరంగల్ కోర్టులో రాజ్యాంగ దినోత్సవం

 స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయానికి ప్రతీక అయిన రాజ్యాంగాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి రాజ్యాంగ విలువల బోధన చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తన కార్యక్రమాలు చేస్తుందని ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వరంగల్ కోర్టు అంబేద్కర్ హాల్ లో ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిమిల్ల రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి మాట్లాడారు. భారతదేశంలో రాజ్యాంగ అమలులోకి వచ్చి 76 ఏండ్లు గడిచినా నేటికి మెజార్టీ ప్రజలకు రాజ్యాంగ విలువలు, హక్కులు, రాజ్యం, ఓటు విలువ, ఎన్నికలు, ప్రజాస్వామ్యం గురించి తెలియకపోవడం బాధాకరమని, పాలకవర్గ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ విలువలను ప్రజలకు తెలియకుండా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని సమర్పించే సందర్భంగా  అంబేద్కర్ మాట్లాడుతూ చరిత్ర మళ్లీ పునరావృతమై దేశ మూలవాసి ప్రజలు మళ్లీ దోపిడీ వంచనకు గురవుతారా? కులాలు, మతాల రూపంలో ఇప్పటికే ఉన్న పాత శత్రువులతో పాటు పరస్పర విరుద్ధమైన రాజకీయ సిద్ధాంతాలు కలిగిన అనేక రాజకీయ పార్టీలు మనకు శత్రువులుగా ఏర్పడబోతున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారని, ఆ మహానీయుడు ఆందోళన చెందినట్లుగానే ప్రజల కోసం వ్రాసిన రాజ్యాంగం పాలక వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రజలను అణచివేసే చట్టాలను తయారు చేయడానికి రాజ్యాంగాన్ని వాడుతూ ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్తరించి స్వేచ్ఛ, సమానత్వాన్ని పెంచాల్సిన పాలకులు కుటిలత్వాన్ని, స్వార్థాన్ని పెంచి మత ఘర్షణలను, జాతి వివక్షతను పెంచి విచ్ఛిన్నకర పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇంతటి భయంకరమైన స్థితిలో అణగారిన వర్గాల నుండి ఎదిగిన న్యాయవాదులు రాజ్యాంగ విలువలను, హక్కులను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో నల్ల కోట్లతో నీలి విప్లవం విజయంతం చేయడం కోసం ఐ ఎల్ పి ఎ దేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తుందని, ఆ ఉద్యమంలో ప్రగతిశీల భావాలున్న న్యాయవాదులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. 
ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిర్ర సాంబశివరాజు, పరికరాల రఘుపతి, ఐ ఎల్ పి ఎ వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన కార్యదర్శులు గురిమిల్ల రాజు, చింత సాంబశివరావు, ఐ ఎల్ పి ఎ వరంగల్ బార్ ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల రాజ్ కుమార్, ఐ ఎల్ పి ఎ హనుమకొండ బార్ అధ్యక్షులు పూసపల్లి శ్రీనివాస్, ఐ ఎల్ పి ఎ జిల్లా నాయకులు పోతన సంధ్యారాణి, బండారు కవిత, జన్ను ప్రభాకర్, కట్కూరి సూరయ్య, జాషువ, కోటేశ్వరరావు, నదునూరి చంద్రమౌళి, అనిల్, మైదం చంద్రకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం