యుద్ధం ఏం చెబుతోంది

..

అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచానికి ఏం చెప్తోంది..
యుద్ధం కారణంగా ధరలు పెరిగాయి..జనజీవనం
మొత్తంగా మారిపోతోంది..
ప్రపంచం నిన్నటిలా.. మొన్నటిలా ఈరోజు లేదు..
రేపు ఇప్పుడున్నట్టు కూడా ఉండబోదు..ఇవన్నీ మనం ఊహిస్తున్నవే..వీటిని మించి
ఈ ప్రపంచానికి ఈ యుద్ధం
మరిన్ని విషయాలు
చెబుతోంది..యుద్ధం మొదలైన ఇన్ని రోజుల
తర్వాత ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి..
అవేంటో ఒక లుక్కేద్దాం..

ఇంతవరకు ప్రపంచం అనుకున్నట్టు అమెరికా
ఏం సూపర్ పవర్ కాదండోయ్…

అలాగే ఇరాన్ పైకి కనిపించేంత వీక్ కూడా కాదు..

డోనాల్డ్ ట్రంప్ తన గురించి
తాను ఎక్కువగా ఊహించుకుని ప్రపంచం సంగతి సరే..తన దేశాన్నే
ప్రమాదంలోకి నెడుతున్నారు..

అమెరికా కలలు కన్నట్టు
యుద్ధం కారణంగా చైనా
అతలాకుతలం అయిపోలేదు..
మేం భద్రం సుమా అంటూ
ధీమాగా కూర్చుని వినోదం చూస్తోంది చైనా..

ఇవి మాత్రమే కాదు..
ఇంతవరకు తన బలం గురించి ప్రపంచం ముందు పెద్దగా గొప్పలు పోని కువైట్
3f 15 జెట్ నే తుత్తునియలు చేసి తన ఘనతను చేసుకుంది.. గప్ చిప్ గా..

అమెరికాలోని బడాబాబులందరూ ట్రంప్ చెప్పగా యుద్ధం తమ దేశమే గెలవబోతుందన్నట్టు పందాలు కాసి అసత్య ప్రచారాలు సాగిస్తున్నారు..

ఈ సందట్లో సడేమియాలా
అంబానీ తన ఆయిల్ సామ్రాజ్యాన్ని మరింతగా
విస్తరించుకుంటున్నారు.
ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా ఉన్న ముఖేష్ ఈ యుద్ధం పుణ్యమాని దునియా మొత్తంమీద అగ్రస్థానానికి వెళ్ళినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు..

అన్నట్టు..ఇప్పుడు ప్రపంచ నియంతల్లో కిమ్ మాత్రమే భద్రం..ఆయన అమ్ములపొదిలో బోలెడన్ని
ఆయుధాలున్నా అవి ఖర్చు చేసే యుద్ధం బాధ లేదు..

మొత్తానికి ప్రపంచానికి అనవసరమైన ఈ యుద్ధం
ఎన్నో జాతకాలను తారుమారు
చేయబోతోంది..
అందరి కంటే ముందు..
ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు మన దేశంలో మధ్యతరగతి మానవుడి నడ్డి
విరుగుతోంది..

మన దేశానికి ఆయిల్ ..గ్యాస్ కొరత ఉండదు..
బిజెపి ఏలుబడిలో
మనం సురక్షితమని
కాషాయ దండు
ప్రచారం చేసుకుంటూ ఉండగా.. విశ్వగురు సైతం
ఆయిల్ విషయంలో
భద్రమని ఏదో కబురు
చల్లగా చెప్పారు.
పైకి పొదుపు మంత్రంగా
వి(క)నిపిస్తున్నా ఇది
తీవ్రమైన పరిణామమే..
చేతులెత్తేస్తున్న టైపే..

కాన్వాయిల్లో వాహనాలు తగ్గించుకుంటే పొదుపు
అయిపోతుందా..దేశంలో
ఎన్ని వ్యవస్థల్లో ఎంత వ్యర్థం జరుగుతుందో మనకి తెలియదా..

ఈరోజున ఒక పెద్దాయన
మోడీజీ పిలుపును అనుసరించి సైకిల్ పై కార్యాలయానికి వెళ్లి మంచి ప్రచారం చేసుకున్నారు.
ఇది ఆయన భాషలో పొదుపే కావచ్చు.కానీ కార్యాలయానికి చేరిన తర్వాత ఏసి వేసుకోవడం మానేస్తారా..

ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో చలికాలంలో సైతం ఏసి వేసుకోవడం చూస్తాం. అలాగే ప్రభుత్వ వాహనాల్లో ప్రైవేట్ పనులు,
షాపింగ్ లు చేసుకునే అధికారులు ఎందరో..
వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ సిబ్బందిని సొంత పనులకు వాడుకునే అధికారులను,రాజకీయ నాయకులను మనం చూడటం లేదా. అసలు అధికారుల మీద,మంత్రుల మీద.. ఇతర ప్రజాప్రతినిధుల మీద రోజు ఎంత ప్రజాధనం ఖర్చు అవుతుందో లెక్కవేస్తే ముక్కున ముక్కున వేలేసుకోక తప్పదు.
అసలు ప్రధాన మోడీజీ రోజువారీ ఖర్చు ప్రభుత్వపరంగా ఎంత జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం..

ఇంతా చేస్తే..
కవి అన్నట్టు..
ఎదుటి మనిషికి చెప్పేటందుకే
నీతులు ఉంటాయి..

           *_సురేష్.._*
Share this post

One thought on “యుద్ధం ఏం చెబుతోంది

  1. I’ll rigyht away takje old of yur rsss ass I can’t findd
    our e-mail subscrition hyperlink oor e-newsletter service.
    Do yoou hawve any? Kinmdly permiut mme ealize soo that I may subscribe.
    Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం