Headlines

ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఆధ్వర్యంలో సాహు 151 వ జయంతి

సాహు మహారాజ్ స్పూర్తితో బి.సి రాజకీయ వాటాకై పోరాటం

సామాజిక న్యాయానికి పునాదులు వేసిన సాహు మహారాజ్

ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఆధ్వర్యంలో సాహు 151 వ జయంతి కార్యక్రమం

 భారతదేశానికి స్వాతంత్రం రాకముందే పరాయి పాలనలో జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన సాహు మహారాజ్ స్పూర్తితో స్థానిక సంస్థలతో పాటు, చట్టసభల్లో బి.సి ల వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన 151వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సాహు మహారాజ్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నందునే రాచరిక పరాయి పాలనలో సామాజిక న్యాయాన్ని అమలు పరిచారని, నేడు ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ప్రజలను అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ అసమానతలకు కారకులవుతున్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయానికి సాహు మహారాజ్ పాలనని, కొల్లాపూర్ సంస్థానంలో సాహు పాలన నుండి ఎన్నో విధానాలను తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారతదేశ తొలి రిజర్వేషన్ సృష్టికర్త సాహు మహారాజ్ తన సంస్థానంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో సమాన హక్కులు కల్పిస్తూ అందరికీ రిజర్వేషన్లు అందించిన సాహు మహారాజ్ తన పట్టాభిషేకం నాడు జరిగినటువంటి అవమానాన్ని గమనించి ప్రజలంతా స్వాభిమానంతో జీవించే పాలన కోసం ఎన్నో సంస్కరణలు చేశారని, పూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ అమలులో భాగంగా అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. వితంతువుల వివాహాలు, మహిళలకు విద్య , పేదలకు గురుకుల పాఠశాలల ఏర్పాటు లాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి నేటి బహుజన సమాజానికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. సాహు స్పూర్తితో బి.సి ఉద్యోగాలను కొల్లగొట్టేందుకు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా రద్దుకై పోరాటం చేయాలని అన్నారు. బీసీలు ఐక్యమత్యంతో పోరాటం చేసి తమకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన హక్కులను సాధించి భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సోమ రామమూర్తి , గొల్లపల్లి వీరస్వామి, బుసిగొండ ఓంకార్, చాపర్తి కుమార్ గాడ్గే, పోతరాజు లక్ష్మీనారాయణ, పి వెంకట చారి, సాగంటి మంజుల, సింగారపు అరుణ, తాటికొండ సద్గుణ, దిడ్డి ధనలక్ష్మి, కాసుల సరోజన, సంగాల సురేఖ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE