నూతన న్యాయమూర్తులకు సన్మానం

NEW JDGES FELICITATION

 నానాటికి పెరుగుతున్న నేరాలు, మోసాల సమాజంలో న్యాయమూర్తులు సామాజిక దృక్పథంతో ఉండాలని, త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ లు అన్నారు. ఇటీవల వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి న్యాయమూర్తులుగా ఎన్నికైన గంగిశెట్టి ప్రసీద, ధారా సాయి మేఘన, అంబటి ప్రణీత లకు వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో వారికి అభినందలు తెలిపి శాలువాలతో సత్కరించి మెమంటోలు ఇచ్చి సన్మానం చేశారు.  ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిపై మక్కువతో ఎంతో కష్టపడి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎన్నికవడం గొప్ప విషయమని, దేశంలోనే వరంగల్ బార్ న్యాయవాదులకు ఘనమైన చరిత్ర ఉందని, ఇక్కడ పని చేసిన ఎందరో న్యాయవాదులు,  న్యాయమూర్తులు ఉన్నత శిఖరాలకు ఎదిగారని అలాంటి చరిత్రను నూతనంగా ఎదిగిన న్యాయవాదులు నిలబెట్టాలని, బాధితులకు అండగా త్వరితగతిన న్యాయమూర్తుల తీర్పులు ఉండాలని సూచించారు. ఎందరో త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ ఏర్పడడం వల్లనే తెలంగాణలో న్యాయమూర్తులుగా ఎన్నికయ్యే అవకాశాలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువగా న్యాయమూర్తులుగా ఎన్నికవడం కోసం నూతనంగా ఎన్నికైన న్యాయవామూర్తులు వారి వంతు సహకారం అందివ్వాలని అన్నారు. 

నూతనంగా ఎన్నికైన న్యాయమూర్తులు మాట్లాడుతూ బార్, బెంచి సంబంధాలను స్నేహపూర్వకంగా నిర్వహించి సీనియర్ న్యాయవాదులు సూచనలను పాటించి వరంగల్ ఖ్యాతిని నిలబెట్టి బాధితులకు అండగా తీర్పులు వచ్చేవిధంగా చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు డి రమాకాంత్, కొత్త రవి, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శశిరేఖ, సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, కె నరసింహరావు, చిల్ల రాజేంద్ర ప్రసాద్, ఐత ప్రసాద్, వొద్దిరాజు గణేష్, గుడిమల్ల రవి కుమార్, ఆశీర్వాదం, లడె రమేష్, సిరిమల్ల అరుణ, మంగినపల్లి సదాశివుడు, సాంబశివరావు, వొద్దిరాజు వెంకటేశ్వరరావు, నాగేంద్ర చారి, రామగోని నరసింగరావు, ఇజ్జగిరి సురేష్, పూస శ్రీనివాస్, కె వి కె గుప్త, గునిగంటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, మైదం జైపాల్, ముసిపట్ల శ్రీధర్, వెంకటేష్, స్వాతి, తోట అరుణ, వేద కుమారి, సునీల్, చింతా నిఖిల్, శివకుమార్ యాదవ్, సాయిని నరేందర్, రాచకొండ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

One thought on “నూతన న్యాయమూర్తులకు సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి