మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమానికి సిద్ధమైన పోటీదారులు
గచ్చిబౌలిలో అలరించిన కంటెస్టెంట్స్ రిహార్సల్స్
హైదరాబాద్, మే 8: గచ్చిబౌలి స్టేడియంలో మే 10న జరగనున్న మిస్ వరల్డ్–2025 ప్రారంభ కార్యక్రమానికి పోటీదారులు సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో గురువారం జరిగిన రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో అందంగా కనిపించారు. వారి ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు.
సమయాను కూలంగా స్టేజ్ ఎంట్రీలు, గ్రూప్ మూవ్‌మెంట్స్, లైటింగ్, మ్యూజిక్ సెట్ అప్ తదితర అంశాలను నిర్వాహకులు పరిశీలించారు.
ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్ పూర్తిచేశారు.
ఈ ప్రారంభ వేడుకలో భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా కార్యక్రమం ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.


















I will right away grab your rss feed as I can’t find your e-mail subscription link or newsletter service. Do you’ve any? Kindly allow me understand in order that I may subscribe. Thanks.