బైక్ పై ముందు ములుగు ఎస్పి శబరిష్.. వెనుక మంత్రి సీతక్క

హోదాను పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారు మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అయితే హోదాను పక్కనపెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్ ప్రయాణించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించడంతో స్థానికులు జై సీతక్క అంటూ నినాదాలు చేశారు.

గద్దెలుమారుస్తున్నారని దుష్ప్రచారం -మంత్రిసీతక్క

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతర గద్దెల సుందరీకరణపై కొందరు దుష్ప్రచారం సాగస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్వార్థంతో ఇష్టారీతిన మేడారం జాతరపై ఆరోపణలు చేస్తున్నారని సమ్మక, సారలమ్మల గద్దెలు మారుస్తున్నామని ప్రచారం చేస్తున్నారని అన్నారు. గద్దెల అభివృద్ధికి ఇంకా DPR కూడా సిద్ధం కాలేదని సీతక్క స్పష్టం చేశారు. జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి హితవు పలికారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో