Site icon MANATELANGANAA

లంచం తీసుకుంటూ పట్టుబడిన మాదాపూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్


మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న గండ్ర వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

స్టేషన్లో నమోదైన Cr. No. 2202/2025 కేసుకు సంబంధించి నోటీసు కాపీలు అందించడం, అలాగే భవిష్యత్తులో ఈ కేసులో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా సహకరిస్తానని చెప్పి రూ.50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ గండ్ర వినయ్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గండ్ర వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటి నుండి లంచాలకు పీడించే వాడని ఫిర్యాదులున్నాయి.
ఫిర్యాదుదారుడు  ఎస్ఐ వేధింపులు భరించ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Share this post
Exit mobile version