Headlines

హనుమకొండలో పాఠశాల విద్యార్థులకు కిట్స్ వరంగల్ డైస్ ఇన్నోవేషన్ కార్యక్రమం

హనుమకొండ: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (C-i2RE), ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) సంయుక్తంగా పాఠశాల విద్యార్థుల కోసం డైస్ (DICE) – స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

హసన్‌పర్తిలోని పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్, శాయంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (SIC), డెవలపింగ్ ఇన్నోవేషన్ కల్చర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (DICE) కార్యక్రమాల్లో భాగంగా పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు.

కిట్స్ వరంగల్ సి-ఐ2ఆర్‌ఈ హెడ్ ప్రొఫెసర్ కె. రాజా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు, వ్యాపారవేత్తృత్వంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సృజనాత్మక ఆలోచనలు, కొత్త అంశాల రూపకల్పన, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలను వివరించినట్లు చెప్పారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను ఆలోచించేలా విద్యార్థులను ప్రోత్సహించారు. చర్చలు, వివిధ కార్యకలాపాల ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పించారు. ఒక సమస్యను విభిన్న కోణాల్లో పరిశీలించి, వినూత్న ఆలోచనలతో పరిష్కారాలు కనుగొనే విధానాలను వివరించారు.

విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతతో పాటు ఆవిష్కరణలు, వ్యాపారవేత్తృత్వంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ సి-ఐ2ఆర్‌ఈ హెడ్ ప్రొఫెసర్ కె. రాజా నరేందర్ రెడ్డి, ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ కో-కోఆర్డినేటర్, ఈసీఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజు రెడ్డి పాల్గొన్నారు.

అలాగే సాయిల్ (SAiL) ప్రెసిడెంట్ ఎం. రిత్వికేష్, జనరల్ సెక్రటరీ ఎ. రమ్య రెడ్డి, ఈవెంట్ మేనేజర్ ఆర్. సుధాంశు, స్టూడెంట్ కోఆర్డినేటర్ కె. స్పూర్తి, పీఆర్ అండ్ ఓ ప్రెసిడెంట్ కె. రిషి సిద్ధార్థ్, ఈవెంట్ మేనేజర్ జోసెఫ్ రెడ్డి, సభ్యుడు పి. తరుణ్ పాల్గొన్నారు.

కిట్స్ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారి, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, 100 మందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం