రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయం లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
RCTAT అధ్యక్షులు పులి సారంగపాణి జాతీయ పతకావిష్కరణ చేసారు.
ఈ సందర్బంగా పులి సారంగపాణి మాట్లాడుతూ త్యాగ ధనుల ఫలితంగా సిద్దించిన స్వాతంత్ర్యం ఔనత్యాన్ని పాలకులు నిలబెట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడ త్యాగాలతో ఫలించిందని గుర్తు చేసారు.
ప్రభుత్వాలు ఏవైనా ప్రజల బాగోగులకోసం పనిచేయాలన్నారు. సీనియర్ సిటిజన్స్ పట్ల ప్రభుత్వాలు భాద్యతాయితంగా వ్యవహరించాలన్నారు. పాశ్చ్చాత్య దేశాలలో కల్పించే సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా చేయాలన్నారు.
తలసరి ఆదాయం విషయంలో ఆదాని ఆదాయం సామాన్యుల ఆదాయం సరాసరి గణించకుండా వాస్తవాల ఆధారంగా తలసరి ఆర్థిక సూచికలు రూపొందించాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రావు, సెక్రటరీ మల్లారెడ్డి, జాయింట్ వైస్ ప్రెసిడెంట్ బి.వి.రావు తదితరులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.


