హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు – బి. స్వరూప ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
మున్సిపల్ కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనులను మెజర్మెంట్ బుక్ (ఎంబి బుక్) లో రికార్డు చేసేందుకు స్వరూప లక్ష ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసారు. దాంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం స్వరూప లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హాడెండ్ గా పట్టుకున్నారు.
లంచగొండి అధికారుల పై టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (
@TelanganaACB ) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చని ఎసిబి అధికారులు తెలిపారు. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంటాయని తెలిపారు.
కరీంనగర్ లో ఎసిబీకి చిక్కిన ఇద్దరు అవినీతి ఉద్యోగులు

కరీంనగర్‌లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం, కార్యనిర్వహణ ఇంజనీర్ (పంచాయత్ రాజ్) వారి కార్యాలయంలో సహాయ ఇంజనీరు – శరత్ మరియు సీనియర్ అసిస్టెంట్ – వేణుగోపాల్ ఇద్దరూ ఎసిబి అధికారులకు చిక్కారు.
అద్దె కారు ఓనర్ కు సంబంధించి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె వాహన బిల్లులను సిద్ధం చేయడానికి ఈఇద్దరు అధికారులు లంచం అడిగారు. భాదితుడి నుండి రూ.8,000 వేల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు దొరికారు.


I’m impressed, I need to say. Actually hardly ever do I encounter a blog that’s each educative and entertaining, and let me tell you, you’ve hit the nail on the head. Your concept is excellent; the issue is one thing that not enough people are talking intelligently about. I am very completely satisfied that I stumbled across this in my seek for one thing regarding this.