అన్ని దశలపనులు సంపూర్ణంగా పూర్తిచేస్తామని హామి
రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని
దేవాదుల పంపు హౌజ్ స్టేషన్ ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దేవాదుల పంపు హౌజ్ లో వివిధ అంశాలపై సాగునీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు
హనుమకొండ: దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని దశలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులో ని దేవాదుల పంపు హౌజ్ స్టేషన్ ను రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా దేవన్నపేటలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద మంత్రులు దిగగా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పుష్పగుచ్చాలను అందజేశారు.
దేవాదుల పంపు హౌజ్ స్టేషన్ చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టన్నెల్ ను పరిశీలించారు. అనంతరం దేవాదుల పంపు హౌజ్ పనుల పురోగతి, ఇతర అంశాలపై సాగునీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీరు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదుల మూడు పైపు లైన్ల పంపులను ఆన్ చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దేవాదుల పంప్ హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా సాగునీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్, సీఈ అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


znine5
It’s hard to find knowledgeable people on this topic, but you sound like you know what you’re talking about! Thanks
It is really a great and useful piece of info. I am glad that you shared this helpful info with us. Please stay us up to date like this. Thanks for sharing.
I really like your writing style, fantastic info , thanks for putting up : D.
I believe that is among the so much vital information for me. And i’m satisfied reading your article. However should remark on few common issues, The web site taste is perfect, the articles is really nice :D. Just right task, cheers
Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do a little research about this. We got a grab a book from our local library but I think I learned more clear from this post. I am very glad to see such excellent information being shared freely out there.
I have been browsing on-line more than 3 hours lately, yet I by no means found any attention-grabbing article like yours. It’s lovely worth enough for me. In my opinion, if all web owners and bloggers made good content material as you probably did, the web will probably be a lot more useful than ever before.
you are really a good webmaster. The web site loading speed is incredible. It seems that you’re doing any unique trick. Also, The contents are masterpiece. you have done a excellent job on this topic!