ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -కృతఙ్ఞతలు తెలిపిన చైర్మన్ రవీందర్ రావు
తెలంగాణ రాష్ట్రoలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పాక్స్) జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గాల పదవీకాలన్ని మరొక 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…
ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ..
సహకార సంఘాల పదవి కాలం పొడగించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గl, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీతక్క మరియు కొండా సురేఖ,జిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు…
ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకరాలకు ధన్యవాదాలు,రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని తెలిపారు…
btm4gp