మున్సిపల్ ఎన్నికల్లోకాంగ్రేస్ పార్టి అత్యధికంగా పదవులు గెలిచి పతాక స్థాయిలో నిలిచింది. ప్రధాన బిఆర్ఎస్,బిజెపి పార్టీలు గట్టి పోటి ఇచ్చినా కాంగ్రేస్ పార్టి జోఫ్ ను నిలువరించ లేక పోయాయి.
దాదాపు రాష్ర్టంలో అన్ని జిల్లాలలో కాంగ్రేస్ పార్టీకి అధిక్యత లభించింది.
మొత్తానికి కాంగ్రేస్ పార్టి ఎమ్మెల్యేలు,మంత్రులు మున్సిపల్ ఫలితాలలో డిస్టిన్షన్ సాధించినట్లు సంబరపడి పోతున్నారు.
ఒకటి రెండు చోట్ల తప్ప కాంగ్రేస్ పార్టీకి ఎక్కడా ఘోర పరాభవాలు లేవు. రెబల్స్ కారణంగా చేజార్చుకున్న చోట కాంగ్రేస్ అభ్యర్థులు గట్టి పోటి ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కమల్లు ప్రాతినిద్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో 22 స్థానాలకుగాను 21 స్థానాల్లో కాంగ్రేస్ విజయం సాధించింది.
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు మున్సిపాల్టీలో సునాయాసంగా మెజారిటి స్థానాలు గెలిచారు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టి గట్టి పోటి ఇచ్చింది.
మాజి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహించిన స్టేషన్ ఘనాపూర్ లో కూడ కాంగ్రేస్ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి.
అత్యంతప్రతిష్టాత్మకంగా భావించిన కరీంనగర్ కార్పోరేషన్ లో కాంగ్రేస్ పార్టీకి కల్సిరాలేదు. బిజెపి సగానికి సగం సీట్లు గెలుచుకుంది.
అట్లాగే ఆదివాసి జిల్లా ఆదిలాబాద్ లో కూడ బిజెపి విజయఢంకా మోగించింది.
డిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఫలితాలపై అమితానందం వ్యక్తం చేశారు. ఈఫలితాలు తమపార్టి నేతలు కార్యకర్తల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు.
రెవంత్ రెడ్డికి పార్టి అద్యక్షులు మల్లికారుజన్ ఖర్గే,నేతలు రాహుల్ గాంధి,ప్రియాంక గాంధి అభినందనలు తెలియ చేసారు.
రేవంత్ రెడ్డికి పార్టి అద్యక్షులు మల్లికారుజన్ ఖర్గే,నేతలు రాహుల్ గాంధి,ప్రియాంక గాంధి అభినందనలు తెలియ చేసారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


Great site. Lots of useful info here. I am sending it to some friends ans also sharing in delicious. And certainly, thanks for your effort!
Giờ hãy cùng tìm hiểu chi tiết hơn về những đặc điểm nổi bật đã giúp slot365 đăng nhập ghi điểm trong mắt cộng đồng người chơi. TONY04-14H