బి ఆర్ ఎస్ కు భారీ షాక్… కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకులు


“ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంట ” – ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, ఫిబ్రవరి 16 (సోమవారం):
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాపాలన కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
కాజీపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుంటి కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కండువా ధరించడం గౌరవప్రదమైన విషయం అని అన్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదేనని తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, తాను ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబూబకర్, రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సర్వర్, షేక్ గులాం రసూల్, యూసుఫ్, రాజు, విఘ్నేశ్, రవి సహా సుమారు 40 మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Share this post

4 thoughts on “బి ఆర్ ఎస్ కు భారీ షాక్… కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నాయకులు

  1. 66b. – Nơi biến những giấc mơ triệu phú thành hiện thực. Click ngay vào link chính thức để bắt đầu hành trình của bạn. TONY04-14H

  2. Thanx for the effort, keep up the good work Great work, I am going to start a small Blog Engine course work using your site I hope you enjoy blogging with the popular BlogEngine.net.Thethoughts you express are really awesome. Hope you will right some more posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం