అందంగా సెలబ్రిటీ..
అడ్డగోలుగా లూటీ..?
సెలబ్రిటీల ముసుగులో
పెరుగుతున్న ఆర్థిక అక్రమాలు..
దొరికే వరకు అందరూ దొరలే..
దొరికిన తర్వాత కూడా
అదే సోషల్ మీడియా వేదికగా
బుకాయింపులు..
సోషల్ మీడియాలో
పాపులారిటీని అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్న సెలబ్రిటీలు..
చేతిలో ఉన్న కళతో పాటు
అరవై నాలుగు కళల్లో
చోర కళను బాగా వాడుకుంటున్న
ఘరానా కిలాడీకారులు..
మొన్న మంగ్లీ..
ఇప్పుడు నందూ..
ఇంతకు ముందు ఇంకొందరు..
రేపు.. ఎల్లుండి ఇంకెందరో..
తప్పు ఎవరిది..
దోపిడీకి పాల్పడుతున్న
పెద్ద మనుషులదా..
ఇన్ని జరుగుతున్నా
ఇంకా నమ్ముతున్న జనాలదా..
అరికట్టలేకపోతున్న
ప్రభుత్వాలదా..
ఏది నిజమో..
ఏది అబద్ధమో..
ఏది పుకారో..
మొత్తానికి సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యాన్ని
పొందిన ఇద్దరు వ్యక్తులు..
వాళ్ళ ముద్దు పేర్లు..
సెలబ్రిటీలు..
ఈమధ్య ఆర్థిక మోసాలకు
పాల్పడినట్టు అదే సోషల్ మీడియాలో క్లిప్పింగులు..
మళ్ళీ వాటిలోనే వాళ్ళపై
షార్ట్స్..ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్..ఒకదాని వెంట
ఒకటిగా అల్లాడించేస్తున్నాయి..
మొన్న సింగర్ మంగ్లీ ఉదంతం
రేపిన సంచలనం అంతా ఇంతా కాదు..ఇటు వివాదాన్ని
ట్రిగ్గర్ చేసిన న్యాయవాది
వరస వీడియోలు చేస్తే..
నాకు అన్నెం పున్నెం తెలియదంటూ మంగ్లీ వీడియోల మీద వీడియోలు
గుప్పించేసింది..
వీటిలో నిజం ఎంత..
అబద్దం ఎంత..
నిబద్ధత ఎంత..
యూ ట్యూబర్ నందూ..
ఆమె భర్త జాగర్లమూడి
మధుకర్ ఇంగ్లాండ్ లో
ఉద్యోగాలు ఇప్పిస్తామని
చెప్పి కనీసం యాభై మంది వద్ద నుండి ఒక్కొక్కరి నుంచి
ఇరవై లక్షలు..హోల్ మొత్తం హోల్ సేల్ గా పది కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ఆరోపణ..
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి
సినిమాలో ఆయనతో పాటు
స్క్రీన్ అప్పియరెన్స్ ఇచ్చి
తన ఇమేజ్ ను మరింత
పెంచుకున్న నందు
ఇప్పుడిలా ఒక్కసారిగా
అన్ పాపులర్ అయిపోయింది.
నందు..ఆమె భర్త మధుకర్
యధావిధిగా ఈ ఉదంతంతో
తమకేమీ సంబంధం లేదని,
తమ పాపులారిటీ చూసి
ఓర్వలేక కొందరు గిట్టని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని
చెబుతున్నారు.
అయితే గంట గడుస్తున్న కొద్ది
నందు జంట చేసినట్టు చెబుతున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటికి వస్తూనే ఉన్నాయి..
అదండీ సంగతి..
నందూ కావచ్చును..
మంగ్లీ అవొచ్చును..
రేపు ఇంకొకరే బయటపడవచ్చును..
మోసపోయిన తర్వాత నెత్తినోరు కొట్టుకునే బదులు
జనం ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా..!
*_ఈఎస్కే..జర్నలిస్ట్_*

