ములుగు జిల్లా రెడ్ క్రాస్ భవనానికి నిధులు- మంత్రి సీతక్క హామీ

నీరు. విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించండి.
ములుగు జిల్లా రెడ్ క్రాస్ భవనానికి నిధులు కేటాయిస్తాం. మంత్రి సీతక్క. మంత్రిని కలిసిన ములుగు రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు. ములుగు న్యూస్. ఎల్ ని నో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదురుకోవడానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లెం అప్పయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పాలక మండలి సభ్యులు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు తాగునీటి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్తు, సాగు, తాగునీటి పొదుపు పై దృష్టి సారించాలని సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసి ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వెంటనే భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ అధికారి లింగారెడ్డిని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్. కార్యదర్శి కొట్టే రాజిరెడ్డి కోశాధికారి శిరుప సతీష్ కుమార్, జిల్లా పాలక మండలి సభ్యులు గూడూరు మహిపాల్, కోగిల సారయ్య, రవితేజ, రామిడి కృష్ణారెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం