Headlines

జిల్లా కలెక్టర్ ను కల్సిన నూతన రెడ్ క్రాస్ అధ్యక్షులు Dr అప్పయ్య

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి.

రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించాలి.

సేవాభావంతో ప్రజలకు చేరువ కావాలి.

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, మానవతా సేవలకు రెడ్ క్రాస్ సంస్థ చిరునామాగా నిలవాలని జిల్లా కలెక్టర్,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు.

సేవాభావంతో ప్రజలకు చేరువై, జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించాలని అన్నారు.

భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన కార్యాలయ గదిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై వారితో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ కార్యకలాపాలను మరింత క్రియాశీలకంగా నిర్వహించాలని సూచించారు. సహాయం అవసరమైన వారిని గుర్తించి, వారికి సకాలంలో సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ, స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందేలా సంబంధిత వైద్య సంస్థలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు.

విపత్తులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు స్వచ్ఛంద సేవకులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాల్లో నూతన కమిటీ సమష్టిగా
కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, రాష్ట్ర పాలకమండలి సభ్యుడు కొత్తపల్లి ప్రసాదరావు, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం