హైదరాబాద్, మార్చి 30, 2026:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Shiv Pratap Shukla గారిని సోమవారం లోక్ భవన్‌లో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్లు మరియు రాష్ట్ర పాలకమండలి సభ్యులు కలిశారు.
ఈ సందర్భంగా హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు తదితరులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రెడ్ క్రాస్ సొసైటీ సెవెన్ ప్రిన్సిపుల్స్ షీల్డ్, భద్రకాళి శాలువా, ప్రసాదం అందజేశారు. అలాగే హనుమకొండ రెడ్ క్రాస్ AGM నివేదిక పుస్తకాన్ని అందించి రాష్ట్రం మరియు జిల్లాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు రెడ్ క్రాస్ సొసైటీ అందించిన సేవలు ప్రాముఖ్యత కలిగినవని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని సూచించారు. జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ బలోపేతం, బ్లడ్ సెంటర్ల పనితీరు గురించి చర్చించారు. వేసవికాలంలో రక్తం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు తాను సహకారం అందిస్తానని గవర్నర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. పి. విజయచందర్ రెడ్డి, ఇ.వి. శ్రీనివాస్ రావు, కె. ప్రసాద్ రావు, మహేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నటరాజ్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు


xn88 link có mục “tin tức thị trường” – cập nhật biến động odds, sự kiện thể thao ảnh hưởng đến cược. TONY05-08