కిట్స్ వరంగల్‌లో 2001 బ్యాచ్ అలుమ్ని మీట్, సిల్వర్ జూబ్లీ రీయూనియన్
వరంగల్, జూలై 25, 2026:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్ అలుమ్ని అసోసియేషన్ (KITSWAA) ఆధ్వర్యంలో 2001 బ్యాచ్ అలుమ్ని మీట్ మరియు సిల్వర్ జూబ్లీ రీయూనియన్‌ను శనివారం కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని ఎన్‌ఎల్‌ఆర్ షెడ్ ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని అమెరికాలోని ఆపిల్ సంస్థలో సాఫ్ట్వేర్ క్యూఏ లీడ్‌గా పనిచేస్తున్న కిట్స్ అలుమ్ని అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మమత కండి దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మమత కండి మాట్లాడుతూ కిట్స్ వరంగల్‌కు ప్రపంచవ్యాప్తంగా 28 వేల మందికి పైగా అలుమ్ని నెట్వర్క్ ఉందని తెలిపారు. వివిధ దేశాలు, రంగాల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు సంస్థ అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి సహకరిస్తున్నారని చెప్పారు.
విద్యార్థులకు మెంటరింగ్, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తూ కిట్స్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలుమ్ని నెట్వర్క్ ద్వారా విద్యార్థులకు పరిశ్రమ నిపుణులు, కొత్త సాంకేతికతలు, ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిశ్రమ అవసరాలు మరియు విద్యా వ్యవస్థ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమకు అనుగుణమైన సామర్థ్యాలు, ఆవిష్కరణలపై ఆధారిత అభ్యాసాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని ఆమె తెలిపారు.
కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ అలుమ్ని సంస్థకు, విద్యార్థులకు నిరంతరం సహకరిస్తున్నారని చెప్పారు. సదస్సులు, వర్క్‌షాప్‌లు, పారిశ్రామిక పర్యటనలు, ఇంటర్న్‌షిప్‌లు, స్టార్టప్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఉపయోగకరమైన అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2001 బ్యాచ్ రీయూనియన్‌కు 161 మంది నమోదు చేసుకోగా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలుమ్ని హాజరయ్యారని చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే, కిట్స్ మేనేజ్మెంట్ సభ్యుడు వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ 2001 బ్యాచ్‌ను “గోల్డ్ కేటగిరీ బ్యాచ్”గా అభివర్ణించారు. ప్రస్తుత విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం, వృత్తిపరమైన అనుభవం, మెంటరింగ్ అందించి, నైతిక విలువలను పెంపొందించడంలో అలుమ్ని భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 2001 బ్యాచ్ అలుమ్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ వి. రామయ్య, డా. ఎం. శ్రీకాంత్, డా. ఎం. రాఘురామ్, శ్రీమతి ఆర్. నిర్మలాదేవి, ప్రొఫెసర్ పి. నిరంజన్ రెడ్డి, ఎస్. నాగరాజు, డా. ఎం. నర్సింహారావు, పదవీ విరమణ పొందిన అధ్యాపకులు ప్రొఫెసర్ పి. వేణుగోపాల్ రావు, ప్రొఫెసర్ ఆర్. రవీందర్ రావు, ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ రామాదేవి తదితర అధ్యాపకులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
కార్యక్రమంలో కిట్స్ మేనేజ్మెంట్ సభ్యులు, అలుమ్ని డి. కోటి రెడ్డి, శిరీష రంగరాజు, నాగేశ్వర్ రావు కె., వంశీకృష్ణ కె., కరుణాకర్ రావు ఎ., రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎస్. నర్సింహారెడ్డి, అలుమ్ని అఫైర్స్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఇన్చార్జి డా. ఎం. శ్రీకాంత్, ఫ్యాకల్టీ ఇన్చార్జి డా. ఓ. ఆంజనేయులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పీఆర్వో డా. డి. ప్రభాకరాచారి, అధ్యాపకులు, సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా నుంచి వచ్చిన 300 మందికి పైగా అలుమ్ని పాల్గొన్నారు.



