త్రిపిటాకాచార్య రాహుల్  సాంకృత్యాయన్

ఓ బాలుడు తన పదకొండేళ్ళ ప్రాయంలో ఓ ఫకీరు పాడిన ఈ గేయాన్ని విని తన జీవితాన్నే ఒక కొత్త పంథాలో మలుచుకున్నాడు.ఆ బాలుడు ఎవరో కాదు కేదారినాథ్ పాండే.ఉత్తరప్రదేశ్ లోని ఆజమ్‌గఢ్‌ జిల్లాలోని పందహా గ్రామంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో  1893 ఏప్రిల్ 9 వ తేదీన పుట్టారు.ఆనాటి ఆచారం ప్రకారం పాండేకు పన్నెండు సం.ల వయసుకే వివాహం జరిగింది.పదమూడు సం.ల వయసులోనే ఇంటి నుండి పారిపోయినాడు..చిన్న వయసులోనే కేదారినాథ్ పాండే  తల్లిదండ్రులు మరణించడం తో అమ్మమ్మ ,తాతయ్యల దగ్గర పెరిగాడు.చిన్న నాడే రాహుల్ మాంసం తినేవాడు .నేడు బ్రాహ్మణులు మేం శాకాహారులం అనే మాట పూర్తిగా అబద్ధమని అర్థం చేసుకోవచ్చు .పాండే వాళ్ళ అమ్మమ్మకు మాంసం వాసన పడదని అందువలనే తన తాతయ్య తో కలిసి పెరటిలో మాంసం వండుకుని తినే వాళ్ళమని తన ఆత్మకథలో వ్రాసుకోవడం జరిగింది.

🌻కేదారినాథ్ పాండే పదమూడు సం.ల వయసులోనే ఇంటి నుండి పారిపోయినాడు.చిన్న వయసు నుండే లోకాన్ని చూడాలనే తపనతో సత్యాన్ని అన్వేషించాలనే తపనతో ఇంటి నుండి వెళ్ళిన పాండే హిందూ మత భావజాలం నుండి పూర్తిగా బయట పడి బౌద్ధ భిక్ఖువుగా మారి తన పేరును రాహుల్ సాంకృత్యాయాన్ గా మర్చుకున్నారు.హిందూమతంలోని దురాచారాలపై విముఖత కలిగి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. తన పేరుని, బుద్ధుని కుమారుడైన రాహుల్‌ పేరున రాహుల్‌ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నాడు. సాంకృత్యాయన్‌ అంటే విజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకునేవాడని అర్థం. బౌద్ధ భిక్షువుగా ఏళ్లతరబడి టిబెట్లోని అనేక బౌద్ధ ఆరామాలలో గడిపి, టిబెట్‌ భాష నుండి సంస్కృతంలోకి అనేక పురాతన గ్రంథాలను అనువాదం చేశాడు.

👁️చక్ఖు ..చక్ఖు(బుద్ధుడు ప్రపంచం యొక్క కన్ను):

🌹రాహుల్  సాంకృత్యాయాన్ జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన 1910 లో తన పల్లె నుండి బెనారసుకు వెళ్ళేటప్పుడు సారనాథ్ లో బౌద్ధ భిక్ఖువులు ప్రార్థనలు చేస్తుండగా వాళ్ళ దగ్గరకు వెళ్ళగా భిక్ఖువులు చక్ఖు ..చక్ఖు అంటూ రాహుల్ కు బుద్ధుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు.అయితే వాళ్ళ భాష తనకు రాకపోవడం వలన ఏమీ అర్థం కాలేదు తనకు.రాహుల్ జీ కొంత కాలానికి ఈ చక్ఖు అనగా పాళీ చక్షు అని అర్థం.బుద్ధుడు ప్రపంచం యొక్క కన్ను  అని బిక్ఖువులు రాహుల్ జీ కి చెప్పారని  తెల్సుకుంటాడు.

ఒక మనిషిలో అనేక కోణాలు దాగి ఉంటె అతనిని బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెబుతాం.రాహుల్ జీ రచయిత, వ్యాసకర్త,  యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, పండితుడు, భారత జాతీయవాది,మార్క్సిస్టు ,బౌద్ధ పండితుడు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి, వాటిని అనువాదం చేసి, ప్రపంచానికి తెలియపరచటంలో రాహుల్జీ అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు.రాహుల్జీ క్రియాశీలి అయిన ప్రచారకుడు కాదు ఆయన బౌద్ధ పండితుడు.

🌿డా.అంబేడ్కర్ గారి బౌద్ధ ధమ్మ దీక్షను అభినందిస్తూ తన అభిప్రాయాలను రాహుల్జీ నవ దీక్షిత్ పేరుతో ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది.1957 లో లక్నో లోని బుద్ధ విహార్ ఈ కరపత్రాన్ని ప్రచురించడం జరిగింది.ఆ కరపత్రంలో రాహుల్జీ ఇలా అన్నారు.”భారతదేశంలోబౌద్ధ పునరుజ్జీవనోద్యమాన్ని ఆరంభించి బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశానికి గొప్ప సేవ చేసారు.ఆయననిర్వహించిన మహత్తర పాత్రను చరిత్ర ఎన్నటికీ మరచిపోదు.బౌద్ధం సమాజంలో బడుగు వర్గాలను ఉన్నతికి తెచ్చేందుకు మాత్రమే ఉపయోగపడదు.ఆ ధర్మ పునరుద్ధరణ వల్ల ఇమతవరకు సంగ్రహాలయాలుగా మాత్రమే భావించ బడుతున్న పవిత్ర బౌద్ధ ఆరామాలు తమ పూర్వ ఉన్నతిని పొందుతాయి,తద్వారా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. “

🌹మతమౌడ్యం ,కుల మత బేధాలు పోవాలని సమాజంలో దేవుడు అనే కల్పిత భావం పోవాలని రాహుల్జీ కోరుకున్నారు.రాహుల్జీ ఒక సభలో ఆయన ఇలా అన్నాడు.”మీ జీవితాన్ని మీరు సఫలం చేసుకోవాలంటే కేవలం కల్పనే అయిన భగవంతుణ్ణివదిలించుకోవాలి.నేను ఎన్నో దేశాలు తిరిగాను.

(నవ్వుతూ) అక్కడ భూతాలను చూసామని చెప్పినవారు మాత్రం చాలామంది కనిపించారు కానీ భగవంతుణ్ణి చూసామని చెప్పినవారు ఒక్కరూ కనిపించలేదు.

🕊️అందువల్ల మీ అవనతికి మూలం కల్పనా సృష్టి అయిన దేవుడే ,భగవంతుడు సమస్త అజ్ఞానానికి ,గుడ్డి నమ్మకాలకు ,కపటాచరణకుమూలం.”

🌸రాహుల్జీ  వ్రాసిన ఓల్గా నుంచి గంగ  పుస్తకంలో భారతదేశంలో ఆర్యులు ఏవిధంగా స్థిరపడ్డారో, సంస్కృత భాష అభివృద్ధి, వేద, పురాణాల గ్రంథస్థం మొదలైన విషయాలు చరిత్ర తెలియని సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన వివరించారు.మానవ సమాజం, ముఖ్యంగా ఆర్య జాతి పరిణామాన్ని ఆయన గొలుసుకట్టు చరిత్ర కథలరూపంలో రాశారు.

🌺రాహుల్జీ 20 ఏళ్ల ప్రాయం నుంచే ప్రారంభించి సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద చరమదశ వరకు 150 పుస్తకాలు రాశాడు. బౌద్ధం మీద లెక్కలేనన్ని పరిశోధనలు చేసిన గొప్ప పరిశోధకుడు.ఆయనకు బాల్యంలో వివాహం జరిగినా, నిత్య సంచారి అయిన తాను తన భార్యను చాలాఏళ్ల తరువాత ఒకసారి చూశానని తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆయన లెనిన్‌ గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒక మంగోలియన్‌ స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఆమెను భారతదేశంలో స్థిరపడటానికి సోవియట్‌ ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో వారు విడిపోయారు. ఆ తరువాతి కాలంలో ఆయన కమల అనే భారతీయ స్త్రీని వివాహమాడి డార్జిలింగ్‌లో స్థిర పడ్డారు.1963 ఏప్రిల్ 14లో శ్రీలంకలో ఆచార్యుడుగా పనిచేస్తూ, ఆయన అంతిమ శ్వాస విడిచారు. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్‌ నగరంలో బౌద్ధమత పద్ధతిలో నిర్మించబడింది.

🌼’పరుగెత్తకు ప్రపంచాన్ని మార్చు’ అన్న రాహుల్ సాంకృత్యయాన్ రచనలు తెలుగు వాళ్ళు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. రాహుల్ సంకృత్యం ప్రపంచాన్ని మార్చడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

9

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో