భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము నిర్వహించే సహకార వారోత్సవాలను శుక్రవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయం లో టీజీ క్యాబ్ & డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు సహకార పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు…
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
నవంబర్ 14 నుండి 21 వరకు భారత దేశ మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి సందర్భంగా సహకార ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా సహకార ఉద్యమాన్ని విజయవంతంగా కొనసాగీస్తు కార్యాచరణ నిమిత్తం జరుపుతున్నామని ఈ ఏడాది జరగనున్న 72వ అఖిల భారత సహకార ఉత్సవాలు “వికసిత్ భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర” అనే నినాదంతో జరుపుకుంటున్నాం, అందులో భాగంగానే ఈరోజు డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సహకార పతాక వందనం, సహకార ప్రతిజ్ఞ, సహకార గీతం, సహకార గేయం, సహకార నినాదాలతో ప్రారంభించడం జరిగిందనీ వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ ఎండీ వజీర్ సుల్తాన్, జీఎం G.V.ఉషశ్రీ, డిజిఎం అశోక్, ఏజిఎం లు మధు,గొట్టం స్రవంతి,గంప స్రవంతి,రాజు,కృష్ణమోహన్, CTI ట్రైనింగ్ అధికారులు, మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు…

