జర్నలిస్టులకు ఎయిమ్స్ లో ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎయిమ్స్ లో ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు కేంద్ర బొగ్గు,గనుల శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం డిల్లీ లోని ఆయన నివాసంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో భేటీ అయిన సంఘం నాయకులు ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టు హెల్త్ కార్డులు( JHS) కేవలం నిమ్స్ లో మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయని, గతంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఈ క్యాష్ లెస్ హెల్త్ కార్డులను అనుమతించేవారని అయితే ప్రస్తుతం కొన్ని లిమిటెడ్ ఆసుపత్రుల వారు, నిమ్స్ ఆసుపత్రి వారు మాత్రమే వీటిని అనుమతిస్తున్న విషయాన్ని ఆయనకు వివరించారు. అయితే రాష్ట్రంలో దాదాపు 23 వేల మంది అక్రిడిటేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని వీరి సౌలభ్యం కోసం భువనగిరిలో గల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( ఎయిమ్స్) లో ఈ హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చూడటంతో పాటు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. ఈ విషయమై వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి తనకు ఇప్పటికే ఈ విషయంలో ఒక ఆలోచన ఉన్నదని, జర్నలిస్ట్ లతో పాటు దివ్యాంగులకు కూడా ఎయిమ్స్ లో ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా త్వరలోనే సంబంధిత కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రితో భేటీ అయిన వారిలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి యోగానందం, ఐ జే యూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, ఢిల్లీ అధ్యక్షుడు నాగిల్ల వెంకటేష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు తిరుపతి నాయక్, నేతలు కొన్నోజు రాజు, మేక గోపికృష్ణ, ముక్కాల సతీష్, రాజ్కుమార్ గుజరాతి, పబ్బా సురేశ్ పాల్గొన్నారు.

Share this post

One thought on “జర్నలిస్టులకు ఎయిమ్స్ లో ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి

  1. Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice a little something from their store. I’d prefer to use some with the content on my blog whether you don’t mind. Natually I’ll give you a link on your web blog. Thanks for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం