హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలి

CM REVANTH REDDY SOLIDARITY RALLY


హైదరాబాద్,మే 8,2025: ఉగ్రవాదంపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ సంఘీభావ ర్యాలీ జరిగింది.

ముఖ్యమంత్రి జాతీయజెండా చేబూని ర్యాలీలో నడిచారు.

ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రెటరి రామకృష్ణ, పలువురు మంత్రులు, అధికారులు ఆర్మీ అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెప్పింది. ఇకనైనా వక్రబుద్ధిని మానుకోవాలి” అని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని కీలక రక్షణ సంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించారు.

“మేము శాంతి ప్రేమికులమే. కానీ మమ్మల్ని బలహీనులని భావించి దేశాన్ని, మన ఆడబిడ్డల సిందూరాన్ని ముట్టుకుంటే.. ఆపరేషన్ సిందూర్‌లాంటి సమాధానాలు తప్పవు” అని సీఎం హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా దేశ రక్షణకు ప్రతి ఒక్కరు ఏకమవాలని పిలుపునిచ్చారు.

ఈ సంఘీభావ ర్యాలీ ద్వారా దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు తెలంగాణ గడ్డ నుంచి గట్టి సంకేతం పంపినట్టు సీఎం రేవంత్ తెలిపారు.

Share this post

One thought on “హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలి

  1. Good day I am so grateful I found your site, I really found you by accident, while I was researching on Yahoo for something else, Anyways I am here now and would just like to say many thanks for a incredible post and a all round interesting blog (I also love the theme/design), I don’t have time to browse it all at the moment but I have saved it and also included your RSS feeds, so when I have time I will be back to read more, Please do keep up the awesome work.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం