ప్రకృతి సౌందర్యానికి నెంబర్ వన్ …. పహల్గామ్
జమ్మూ కాశ్మీర్ లోయలో పహల్గామ్… వెళుతుంటారు …పచ్చని పర్వతాలు, లిడ్డర్ నది ఒడ్డు, మబ్బులను ముద్దాడే కొండచరియలు…వర్ణనాతీతమైన నేత్రానందంతో పులకరింపచేసే ఆహ్లాదం… సముద్రమట్టానికి సగటున 2,740 మీటర్లు (8,990 అడుగులు) ఎత్తులో ఉండే ఈ పర్యాటకం స్వర్గధామం, ఆధ్యాత్మిక ప్రదేశమే కాక చరిత్ర, ప్రకృతి కలబోత.
పహల్గామ్… పేరులోనే ఓ కథ ఉంది!
పహల్గామ్ అనే పేరు కాశ్మీరీ భాషలో “పుహేల్ గోమ్” నుంచి వచ్చింది. ‘పుహేల్’ అంటే గొర్రెల కాపరి, ‘గోమ్’ అంటే గ్రామం. కాలక్రమేణా ఇది పహల్గామ్ గా మారింది. హిందూ పురాణాల ప్రకారం దీనిని ‘బైల్ గావ్’ అంటే ‘ఎద్దుల గ్రామం’ అని కూడా పిలిచేవారు. శివుడు అమరనాథ్ యాత్ర ప్రారంభించే ముందు తన నంది, ఇతర పవిత్ర వస్తువులను ఇక్కడే వదిలేశాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది.
పహల్గామ్ చుట్టూ విస్తరించిన సతత హరిత అడవులు.. వాటిలో విహరించే కస్తూరి జింకలు, పర్వత మేకలు, చిరుతలు, గోధుమ రంగు ఎలుగుబంట్లు చూస్తే ప్రకృతి వైభవం అర్థమవుతుంది. గాలిలో పర్వతాల నుంచి వచ్చే చల్లటి మోస్తరు గాలి… పచ్చటి గడ్డి మైదానాలు… నదుల గలగలలు… అన్నీ కలిపి పహల్గామ్‌ను ఓ సజీవ మైన దృష్యకావ్యం.

భారతదేశంలో ఆద్భతమైన పర్యాటక ప్రదేశాలు అనేకం హిమాలయాలపైనే కనువిందు చేస్తాయి.
అమరనాథ్ గుహ యాత్ర ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మంచులింగం దర్శనానికి వేల సంఖ్యలో బారులు తీరుతారు.
పహల్గామ్ నుండి ప్రారంభమయ్యే అమరనాథ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలో భక్తులు మంచు శివలింగ దర్శనం చేసుకుంటారు. పురాణాల ప్రకారం, పార్వతికి అమరత్వ రహస్యాన్ని శివుడు ఇక్కడే వివరించాడని నమ్ముతారు. భక్తుల నమ్మకం ప్రకారం, పహల్గామ్‌లో శివుడు తన నందిని విడిచిపెట్టి, తదుపరి శేషనాగ సరస్సు దగ్గర సర్పాలను వదిలాడని కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఇంకా పహల్గామ్ దగ్గర ఏమి చూడాలి?

• కొల్హోయ్ గ్లేసియర్: పహల్గామ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, మంచు కప్పిన కొండలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.
• బైసారన్ – మినీ స్విట్జర్లాండ్: పహల్గామ్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్‌ను చూడకపోతే ప్రయాణమే అసంపూర్తిగా మిగులుతుంది. పచ్చిక మైదానాలు, శ్వేత పర్వతాల సోయగం అసలైన స్విస్ ఫీలింగ్ ఇస్తుంది.
• మార్తాండ సూర్య దేవాలయం: అనంతనాగ్‌కు సమీపంలో ఉన్న ఈ పురాతన దేవాలయం, కాశ్మీర్ లోయలో సూర్యుని పూజకు వెలుగు నిచ్చిన చారిత్రిక క్షేత్రం.
పర్యాటకులకు కీలక సమాచారం
2011 జనాభా లెక్కల ప్రకారం పహల్గామ్ జనాభా 5,922 మాత్రమే. ప్రధానంగా బఖర్వాల్ జాతికి చెందిన వారు ఇక్కడ పశుపోషణ చేస్తూ జీవనం సాగిస్తారు. పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పర్యాటక సదుపాయాలను మెరుగుపరిచారు.
ఏమైంది పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులపై దాడి?
ఒకసారి ఉగ్రవాద ముష్కరుల దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుంది. కానీ దాన్ని అధిగమించి, పహల్గామ్ మళ్లీ ప్రకృతి ప్రేమికుల కలల ఊరుగా నిలిచింది.
ఎలా చేరాలి?
శ్రీనగర్, జమ్మూ నగరాల నుండి అనంతనాగ్ మీదుగా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. వేసవి కాలంలో వాతావరణం హాయిగా చల్లదనంతో ఆహ్లాదంగా ఉంటుంది.



fcn3yw
WONDERFUL Post.thanks for share..more wait .. …
Normally I don’t read post on blogs, however I would like to say that this write-up very pressured me to check out and do it! Your writing taste has been amazed me. Thank you, quite nice post.
What i don’t understood is in reality how you are not really much more well-preferred than you may be now. You are very intelligent. You realize thus significantly in the case of this topic, made me personally imagine it from numerous varied angles. Its like women and men aren’t fascinated until it is something to accomplish with Lady gaga! Your own stuffs excellent. At all times care for it up!
I intended to draft you that little word to finally thank you very much once again for your pleasing pointers you have featured at this time. It’s certainly generous with people like you to allow extensively precisely what a few individuals could have offered for sale as an e-book to end up making some profit for their own end, chiefly now that you might well have done it if you wanted. These tips likewise acted to be a good way to be sure that other people online have the same zeal the same as mine to know lots more around this issue. Certainly there are some more fun moments ahead for individuals that read through your blog post.