హనుమకొండలో దళిత కుటుంబాలకు తక్షణం నీరు,విద్యుత్ పునరుద్ద రించండి – హ్యూమన్ రైట్స్ కమిషన్


Telangana State Human Rights Commission (TSHRC) హనుమకొండలోని చెరబండ రాజు నగర్‌కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కాస్ట్ నివాసితుల ఫిర్యాదులపై మధ్యంతర సిఫార్సులు జారీ చేసింది. కమిషన్‌కు అందిన ఫిర్యాదుల్లో తాగునీటి సరఫరా అన్యాయంగా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కులవివక్ష చర్యలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. బాధితుల వద్ద చెల్లుబాటు అయ్యే హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ ఈ చర్యలు జరిగాయని వారు తెలిపారు.


కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన విచారణ జరిపి, ఈ చర్యలు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వ హక్కు మరియు గౌరవప్రదమైన జీవన హక్కుకు విరుద్ధమని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు TG-NPDCL అధికారులను తక్షణం నీరు, విద్యుత్ సరఫరాలను పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించింది. బలవంతపు ఖాళీ చేయింపులు వంటి చర్యలు తీసుకోరాదని సూచించింది.


వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కులవివక్ష బెదిరింపులను అడ్డుకోవాలని, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కమిషన్ సూచించింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు డీజీపీ పర్యవేక్షణ చేపట్టి అమలు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు అనుసరణ నివేదికల సమీక్ష కోసం మార్చి 9, 2026కి వాయిదా వేసింది.


బాధితుల తరఫున ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ సమర్పించారు. ఆయనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ వేణుగోపాల్ రావు, టి. బాలు (BRSV ఉపాధ్యక్షుడు), బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌కు చెందిన విశ్వేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

Share this post

One thought on “హనుమకొండలో దళిత కుటుంబాలకు తక్షణం నీరు,విద్యుత్ పునరుద్ద రించండి – హ్యూమన్ రైట్స్ కమిషన్

  1. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం