ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన ఘటనలో రూ.8 లక్షల పరిహారం సిఫార్సు
మృతురాలి భర్తకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచన: TGHRC
వనపర్తి: ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వైద్య నిర్లక్ష్యమే మృతికి కారణమని నిర్ధారించిన కమిషన్, బాధిత కుటుంబానికి అదనంగా రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. అలాగే మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాలని సూచించింది.
H.R.C. నం.2355/2018 కేసులో భాగంగా, 06.01.2026న జారీ చేసిన ఉత్తర్వుల్లో గౌరవ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శ్రీమతి ఎం. లలితకు నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో ileal perforation జరగడం, దాన్ని సకాలంలో గుర్తించడంలో జరిగిన ఆలస్యం వల్ల సెప్టిక్ పెరిటోనైటిస్ ఏర్పడి చివరకు కార్డియో–పల్మనరీ అరెస్ట్‌కు దారితీసినట్లు కమిషన్ స్పష్టం చేసింది.
ఇది సాధారణ శారీరక ప్రతిచర్య మాత్రమే అన్న వాదనను కమిషన్ తోసిపుచ్చుతూ, ఇది పూర్తిగా వైద్య నిర్లక్ష్యమేనని తేల్చింది. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించిన రూ.2 లక్షల పరిహారం మృతురాలి వికలాంగ భర్త, ఇద్దరు మైనర్ కుమారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే సరిపోదని పేర్కొంది. అందువల్ల అదనంగా రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసింది.
అలాగే బాధిత కుటుంబం గౌరవంగా జీవించేందుకు వీలుగా మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాలని కూడా ప్రభుత్వానికి సూచించింది.


**mitolyn**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.
magnificent points altogether, you just gained a new reader. What would you suggest about your post that you made some days ago? Any positive?
tại app 188v chính là địa điểm dừng chân lý tưởng, thiên đường giải trí xanh chín đáp ứng đầy đủ tiêu chí anh em không nên bỏ qua. Với sự đa dạng, sức hút và sự cam kết về chất lượng, nhà cái hàng đầu Fun 88 hứa hẹn mang tới cho bạn những trải nghiệm đỉnh cao tuyệt vời cùng cơ hội làm giàu nhanh chóng. TONY02-26H
great post, very informative. I wonder why the other specialists of this sector don’t notice this. You should continue your writing. I’m confident, you have a huge readers’ base already!