తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.రమేష్, లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు తాండూరులో నిర్మించుకున్న షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించేందుకు రమేష్ రూ.15,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్టు అధికారులు తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోరిన పక్షంలో వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని ACB విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చని, అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది.
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అధికారులు హామీ ఇచ్చారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన తాండూరు మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్
