Headlines

KITS వరంగల్‌ ప్రొఫెసర్‌ శ్రీలత కు ఘనంగా పదవి విరమణ సత్కారం


వరంగల్‌, నవంబర్‌ — Kakatiya Institute of Technology & Science, Warangal (KITSW) సిబ్బంది క్లబ్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ (ECIE) శాఖ ప్రముఖ అధ్యాపకురాలు డా. ఎం. శ్రీలత గారి సూపర్‌అన్న్యూయేషన్‌ (పదవీ విరమణ) సత్కారం సిల్వర్‌ జూబిలీ సెమినార్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ డా. శ్రీలత గారి సేవలు సంస్థకు ఎంతో విలువైనవని చెప్పారు. ఆమె 33 ఏళ్లపాటు డీన్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌, ECI విభాగాధిపతి, సెంట్రల్‌ లైబ్రరీ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్‌, HMP ఇన్‌చార్జ్‌ వంటి అనేక బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని ఆయన తెలిపారు.
ఆమెకు సమయ కట్టుబాటు, పరిపాలనా సామర్థ్యం, మానవీయత వంటి విశిష్ట గుణాలు ఉన్నాయని, ఆమె కెరీర్‌ “అద్భుతం, ఆదర్శానికి నిలువుటద్దం” అని పేర్కొన్నారు.
KITSW చైర్మన్‌, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ వి. లక్ష్మికాంత్ రావు, ట్రెజరర్‌ పి. నారాయణ రెడ్డి డా. శ్రీలత ను అభినందిస్తూ, సంస్థ కోసం చేసిన సేవలను ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం సుఖశాంత జీవితాన్ని గడపాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. కోమల్‌ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రొ. పి. రమేష్‌ రెడ్డి, డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌ ప్రొ. కె. వేణుమాధవ్, ECIE హెడ్‌ ప్రొ. కె. శివాని, స్టాఫ్ క్లబ్ అధ్యక్షుడు & CSN హెడ్‌ ప్రొ. వి. శంకర్, కార్యదర్శి డా. ఎ. హరికుమార్, కోశాధికారి & NCC క్యాప్టెన్‌ డా. ఎం. రణధీర్ కుమార్, KITSTA అధ్యక్షుడు ప్రొ. కె. శ్రీధర్, KITSTA కార్యదర్శి & MED హెడ్‌ ప్రొ. శ్రీకాంత్ పబ్బా, PRO డా. ప్రభాకర చారి తదితరులు పాల్గొన్నారు.
డా. శ్రీలత గారి భర్త పి. రమేశ్ బాబు, ఆమె కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డా. ఎం. సురేఖ, మురళీధర్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సహా మొత్తం 200 మంది పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు