మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న పెట్రోల్ బంక్

ఆరు నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య

జిల్లా మహిళా సమాఖ్యచే నారాయణపేట లో ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంక్

మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి


*దేశంలో మహిళా సమాఖ్య చే నడుపబడుతున్న మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు


ఆరు నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు , చిన్న వ్యాపారాలు చేసి కుటుంబానికి చేదోడుగా నిలిచే మహిళలు నేడు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారు. దేశ అభ్యున్నతికి చోదక శక్తిగా ఎదుగుతున్నారు.
నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య లో ఉన్న 8196 మహిళా సంఘాల లో మొత్తం  91,369 మంది సభ్యులు ఉన్నారు.  ఇందిరా మహిళా శక్తి పాలసీ లో భాగంగ నారాయణపేట జిల్లా సింగారం – X  రోడ్డులో రూ 1.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను 2025 ఫిబ్రవరి 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్ళ కు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా ఈ పెట్రోల్ బంక్ నిర్వహణకు బి.పి.సి.ఎల్.

ఫైల్ ఫోటో….. పెట్రోల్ బంక్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకున్నది. అందుకు అనుగుణంగా పెట్రోల్ బంక్ నిర్వహణకు సంబంధించిన 11 మంది  మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్ నగర్ లలోని పెట్రోల్ బంక్ లలో మేనేజర్, సేల్స్ వుమన్ లుగా తగు శిక్షణను ప్రభుత్వం ఇప్పించింది. మొత్తం వ్యయంలో మౌలిక వసతులు కల్పనకు రూ. 15 లక్షలు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ బంక్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్ ను విక్రయిస్తున్నారు. అందులో విధులు నిర్వర్తించే 10 మంది సేల్స్ ఉమన్ లకు ఒక్కొక్కరికి నెలకు  రూ.13,200 చొప్పున,మహిళా  మేనేజర్ కు నెలకు రూ 18,000 లను వేతనంగా జిల్లా సమాఖ్య నుండి తీసుకుంటున్నారు.
మహిళా పెట్రోల్ బంక్  ద్వారా వేతనాలు , ఇతర నిర్వహణ ఖర్చులు పోను 6 నెలల లో రూ 15.50 లక్షల ఆదాయాన్ని  ఆర్జించి నట్లు జిల్లా సమాఖ్య నుండి పెట్రోల్ బంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రకళ తెలిపారు.
. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక ముందడుగుగా పేర్కొనవచ్చు. దీనికి తెలంగాణ లోనే కాదు.. దేశం మొత్తంలో జిల్లా మహిళా సమాఖ్య చే నడిచే మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు పొందింది.

Share this post

One thought on “మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న పెట్రోల్ బంక్

  1. Hello, you used to write wonderful, but the last few posts have been kinda boring… I miss your great writings. Past several posts are just a little out of track! come on!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన