79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా పొన్నాల వెంకట లక్ష్మి ఎర్రగట్టు స్మారక సదనంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణి చేసారు.
ఎల్కతుర్తి మండల పరిధి లోని కేశవపూర్ గ్రామంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ పొన్నాల రామయ్య తల్లిదండ్రుల పేరిట ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.
మండలంలో పదవ తరగతిలో ప్రథములుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు,KGBVఎల్కతుర్తి నుండి ఇద్దరు టాపర్స్ (బాలికల)కు,
ZPHS కేశవాపూర్ లో పదవ తరగతిలో ప్రథమ,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు,
కేశవాపూర్ గ్రామంలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లోని ఐదవ తరగతిలో ప్రథమ,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు అట్లాగే B.Tech, MBBS చదువుతున్న నిరుపేద,ప్రతిభావంతులైన విద్యార్థులకు…
అందరికీ కలిపి మొత్తంగా ₹1,21,000 రూపాయల స్కాలర్‌షిప్ లు ప్రదానం చేసారు.
ఈ కార్యక్రమం లో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పొన్నాల రామయ్య, మేనేజింగ్ ట్రస్ట్ పొన్నాల అరుంధతి, ట్రస్ట్ మెంబెర్ పొన్నాల కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.