ప్రతి జిల్లాకు ఒక పెరిక కుల ఆత్మగౌరవ భవనం
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆక రాధాకృష్ణ
వరంగల్, హనుమకొండ జిల్లాల పెరిక కుల సంఘం ఎన్నిక
వరంగల్ అధ్యక్ష, కార్యదర్శులుగా అచ్చ వినోద్ కుమార్, చింతం యాదగిరి
వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా బొలుగొడ్డు శ్రీనివాస్
హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సాయిని నరేందర్, అంకతి సాంబయ్య
ముఖ్య సలహాదారుగా దిడ్డి నరేందర్
సకల సామాజిక రంగాల్లో పెరిక కులస్తులు అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ పెరిక కుల రాష్ట్ర కమిటి కృషి చేస్తుందని, ప్రభుత్వ పెద్దల సహకారం తీసుకొని ప్రతి జిల్లాకు ఒక పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించి అందులో విద్యార్థుల కోసం వసతి గృహాలను నిర్మించి పెరిక కుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆక రాధాకృష్ణ తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రం పెరిక వాడ ప్రతాపరుద్ర ఫంక్షన్ హాల్ లో దిడ్డి నరేందర్ అధ్యక్షతన జరిగిన వరంగల్, హనుమకొండ జిల్లాల పెరిక కమిటి ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐక్యత ద్వారనే ఏదైనా సాధించవచ్చని, రాష్ట్ర కమిటి చొరవతో పెరిక కుల ప్రజలను విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రాజకీయ రంగంలో బి.సి వాటా కోసం జరిగే పోరాటంలో పెరిక కులస్తులను ముందుంచుతామని రాష్ట్ర ముఖ్య సలహాదారు చింతం లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్య సలహాదారుగా ఎన్నుకోబడిన సీనియర్ నాయకులు రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ దిడ్డి నరేందర్ మాట్లాడుతూ పెరిక కుల అభివృద్ధికి, ఐక్యతకు ఎల్లవేళలా అండగా ఉంటానని, పెరిక కులానికి కన్నా జనాభాలో తక్కువగా ఉన్న కులాలు, వెనుకబడిన కులాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, పెరిక కులస్తుల్లో ఎదిగిన వారు ఎదిగినట్లు వేరు పడుతూ పెరిక కులానికి దూరంగా ఆధిపత్య వర్గాలతో జతగట్టి జీవిస్తున్నారని, కులంలో ఎదిగిన వారంతా ఒక కూటమిగా మారి, వ్యాపారాలు, రాజకీయాల్లో ముందుకు సాగుతూ ఎదగని వారిని గాలికి వదిలేస్తున్నారని అన్నారు. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో పెరిక కులస్తులు రాజకీయ చక్రం తిప్పగలరని, అంతటి శక్తి ఉన్నా, ఐక్యత, అవగాహన, సేవా భావం లేక వెనుకబడిపోయి, అణగదొక్కబడుతున్నారని, ఆత్మగౌరవం కోల్పోయి జీవిస్తున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన వరంగల్, హనుమకొండ జిల్లాల పెరిక కుల కమిటీలకు అన్నిరకాలుగా అండగా ఉంటానని అన్నారు.
పెరిక కుల వరంగల్ జిల్లా కమిటి
వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం ముఖ్య సలహాదారుగా దిడ్డి నరేందర్, అధ్యక్షుడుగా అచ్ఛ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చింతం యాదగిరి, గౌరవ అధ్యక్షులుగా బొలుగొడ్డు శ్రీనివాస్, కోశాధికారిగా బేరె శంకర్, ఉపాధ్యక్షులుగా బేరి శరత్, బిళ్ళ కిషోర్, అక్కల రమేష్, ప్రచార కార్యదర్శిగా పోతరాజు రాజేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా నండ్రె అమర్, సంయుక్త కార్యదర్శిగా బొలుగొడ్డు ప్రభాకర్, న్యాయ సలహాదారుగా బరుపటి రవిరాజు, మీడియా ప్రతినిధిగా ముద్దసాని శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుంచు జగదీష్, కానుగంటి రాజు, బేర కిషన్, బిల్లా రమేష్, గౌరవ సలహాదారుగా సుంచు కట్టమల్లులను ఎన్నుకున్నారు.
పెరిక కుల హనుమకొండ జిల్లా కమిటి
హనుమకొండ జిల్లా పెరిక సంఘం అధ్యక్షులుగా న్యాయవాది, సామాజిక ఉద్యమకారులు సాయిని నరేందర్, ప్రధాన కార్యదర్శిగా గూడూరు మాజీ సర్పంచ్ అంకతి సాంబయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బోల్ల వీరప్రతాప్, ఉపాధ్యక్షులుగా వనపర్తి రాజన్న, కెత్తె రవి, కార్యనిర్వాహక కార్యదర్శిగా అచ్చ పరమేశ్వర్, కోశాధికారిగా పూజారి జితేందర్, ప్రచార కార్యదర్శిగా ఆడిటర్ పూజారి సత్యనారాయణ, కార్యదర్శులుగా సంగని సాంబయ్య, ఆక జగదీష్, ప్రచార కార్యదర్శిగా అప్పని వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు.
కొత్తగా ఎన్నికైన రెండు జిల్లాల కమిటీ నాయకులకు ప్రొఫెసర్ వడ్డే రవీందర్, రాష్ట్ర ముఖ్య సలహాదారులు చింతం లక్ష్మీనారాయణ, డాక్టర్ సంగని మల్లేశ్వర్, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి ముత్తయ్య, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లక్కర్సు ప్రభాకర్ వర్మ, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ధనేకుల కృష్ణ, ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి రంగారావు, కర్రె సురేందర్, అసోసియేట్ అధ్యక్షులు సంగని హరికిషన్, కోట మల్లికార్జున్, ఆర్థిక కార్యదర్శి బోడకుంటి సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బుయ్యాని శివకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పని సతీష్, ములుగు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకు చిడెం మోహన్ రావు, దిడ్డి మోహన్ రావు, గంప నాగరాజు, నట్టే మోహన్ రావు, కానుగంటి శ్రీనివాస్, బుసిగొండ ఓంకార్, అప్పని మాధవరావు, చింతం రమేష్, మీశెట్టి రాజేశ్వర్ రావు, వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతి కుమార్, వల్లాల జగన్ గౌడ్, తదితరులు అభినందనలు తెలిపారు.





