తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో…బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది.

ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి.

షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

పోటీలకు సంబంధించిన అర్హతలు :
1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి.

  1. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
  2. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
  3. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
  4. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి – రూ.3 ల‌క్షలు
ద్వితీయ బ‌హుమ‌తి – రూ.2 ల‌క్ష‌లు
తృతీయ బ‌హుమ‌తి – రూ.1 ల‌క్ష‌
కన్సోలేష‌న్ బ‌హుమ‌తి – రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు.

నిర్దేశిత గడువులోగా వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది.

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ఐడీ
youngfilmmakerschallenge@gmail.com

లేదా

వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి

ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025.

  • దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మ‌న్‌
Share this post

One thought on “తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో…బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…”

  1. Beirut Escorts Escorts in Beirut Beirut Escort Beirut Escorts Service Beirut Escort Girls Escort in Beirut Escorts Service in Beirut Escort Beirut Girls Escort Girls in Beirut Escorts Beirut Lebanon Escorts Escorts in Lebanon Escort Lebanon Escorts Lebanon Escort in Lebanon Lebanon Escort

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం