మహిళలకు ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించిన ప్రజా ప్రభుత్వం.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ములుగు బస్టాండ్ కు చేరు కొని….
ఉచిత బస్సు ప్రయాణ సంబురాల్లో పాల్గోన్న
మంత్రి సీతక్క.
మహిళల కొరకు ఎన్నో పథకాలు అమలుచేస్తూ , మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
మహా లక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర
రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసుకున్న సందర్భంగా బుదవారం ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, రీజినల్ మేనేజర్ డి. విజయ భాను, డి.ఎం. ఎం. రవిచంద్ర, సంబంధిత అధికారులు పాల్గొని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ప్రయాణ భారం లేకండా మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలను మహిళలు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో రూ.6700 కోట్లు వారికి ఆదా అయ్యిందని, ఆ మొత్తాన్ని ఆడబిడ్డల తరుపున ప్రభుత్వమే ఆర్టీసికి చెల్లించిందన్నారు. మహిళల విజయాలను జీర్ణించుకోలేక ఉచిత ప్రయాణాన్ని కొంత మంది అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మహిళల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని…అందుకే ఉచిత ప్రయాణంతో పాటు వడ్డి లేని రుణాలు, రూ.500 కే వంట గ్యాస్, 200 యునిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు చెప్పారు. ములుగులో ఆదునాతన బస్టాండ్ ను నిర్మణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం, చుట్టుపక్కల ప్రాంతాలకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందున బస్సు సర్వీసులను పెంచాలని అధికారులకు సూచించారు. అయితే మంత్రి సీతక్క తన హోదాను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించి మహిళలు, ఆర్టీసీ బస్సు, కండర్టర్ తో మాట్లాడి ఉచిత ప్రయాణంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంత్రి తమతో పాటు ప్రయాణించి, అప్యాయంగా పలకించడంతో మహిళా ప్రయాణికుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి.
ప్రయాణ సమయంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ అనుభావాలు తెలుసుకొన్నారు. మహిళా ప్రయాణికులకు స్వీట్లు తినిపించి సంబురాలు నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం చేశారు.


slot365 link alternatif IM và TF Gaming chắc chắn sẽ không làm bạn thất vọng khi cung cấp hơn 35+ tựa game cá cược Thể thao điện tử cực kỳ hấp dẫn. Bạn có thể xem nhanh tỷ lệ cược sớm – trước trận đấu để bắt ngay kèo thơm cho riêng mình: Kèo chấp bản đồ, kèo tổng số Round, kèo Chẵn/Lẻ,…
tải 188v đã xây dựng được niềm tin lớn từ cộng đồng nhờ chú trọng vào yếu tố an toàn và minh bạch trong mọi khâu vận hành. Với quy trình kiểm soát nghiêm ngặt và công nghệ hiện đại, trải nghiệm của người chơi luôn được bảo vệ tối đa ở mọi khía cạnh.
Sau khi tải xong, mở file cài đặt và làm theo hướng dẫn để cài đặt ứng dụng trên điện thoại của bạn. Ứng dụng slot365 login link hỗ trợ cả hai hệ điều hành Android và iOS, nên bạn không cần lo lắng về tính tương thích.