ఫైర్ బ్రాండ్ కొండాసురేఖ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. వేళి ముద్రగాళ్ళు సిఎం అవుతారంటూ మరో సారితీవ్ర వివాదాస్పదవ్యాఖ్యలు చేసారు. మంత్రి తాను చేసినవ్యాఖ్యలను తప్పుగా అర్దం చేసుకోవద్దని అంటూనే ఈవ్యాఖ్యలు చేసినప్పటికి…. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినుద్దేశించి కాకపోయినా జనరలైజ్ చేసి మాట్లాడినా మీడియా ఊరుకుంటుందా బాగా వైరల్ చేసింది.
మంత్రి కొండా సురేఖకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. మంత్రిపదవి చేపట్టినప్పటి నుండి వరుస వివాదాలు కొని తెచ్చుకున్నారు.
సమంత-నాగార్జున కుటుంబం నుంచి ఇతర ఆరోపణల వరకు మంత్రి తన అనాలోచిత వ్యాఖ్యలతో వైరల్ అయ్యారు.
టాలీవుడ్ నటులు సమంత, నాగ చైతన్య విడాకులు, నాగార్జున కుటుంబం గురించిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అలాగే, గతంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రాక్టులు, లంచాలు వంటి అంశాల్లో కూడా వివాదాస్పదమయ్యాయి.

సమంత-నాగ చైతన్య విడాకులపై వ్యాఖ్యలు: ప్రధాన వివాదం2024 అక్టోబర్‌లో కొండా సురేఖ, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత కేటీ రామారావు (కేటీఆర్)పై తీవ్ర ఆరోపణలు చేశారు. నటి సమంత, ఇంకా నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని, ఆయన నటీమణుల ఫోన్‌లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేసేవారని, డ్రగ్స్ అలవాటు చేసేవారని ఆరోపించారు. ముఖ్యంగా, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చకుండా ఉండటానికి కేటీఆర్ వేధింపులకు గురి చేసేలా ఒత్తిడి తెచ్చారని, దీనికి నాగార్జున కుటుంబం సహకరించిందని కూడ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. నాగార్జున, సమంత, అమల అక్కినేని, జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి వంటి ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు లాగకూడదని, ఇది అసభ్యకరమని ప్రకటించారు.
నాగార్జున హైదరాబాద్ కోర్టులో కొండా సురేఖపై డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. అయితే మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరి 2024 అక్టోబర్ 3న వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
సమంత భావోద్వేగాలను గాయపరచాలని తన ఉద్దేశ్యం కాదని, కేటీఆర్ మహిళలను అవమానించడంపై మాత్రమే దృష్టి పెట్టానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
2025 నవంబర్‌లో మరోసారి నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. “నాగార్జున గారు లేదా ఆయన కుటుంబాన్ని గాయపరచాలని ఉద్దేశ్యం లేదు. నా మాటలు ఏదైనా తప్పుడు అభిప్రాయాన్ని కలిగించినట్లయితే క్షమించండి” అని ప్రకటించారు. దీని తర్వాతే నాగార్జున తన డిఫమేషన్ కేసును ఉపసంహరించుకున్నారు.
కేటీఆర్‌పై ఆరోపణలు చేసినందుకు ఆయన ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. మంత్రిపై కెటిఆర్ పరువు నష్టందావా కేసు కొనసాగుతోంది.
ఇదే కాదు…గతంలో ఓపబ్లిక్ మీటింగ్ లో కాంట్రాక్టులు, లంచాలు ఇచ్చేందుకు మంత్రుల పేషీలకు వస్తుంటారని ఇతర అంశాలపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపి చిక్కుల్లోపడ్డారు.
2025 అక్టోబర్‌లో ఆమె కుమార్తె సుష్మిత పటేల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర రెడ్డి నేతలు తమను టార్గెట్ చేస్తున్నారని, కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇకమంత్రిపదవి ఊడడం ఖాయమని అంతా భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడ మంత్రి కొండా సురేఖ తీరుపట్లు తీవ్ర అసహనానికి లోనైనట్లు చర్చ జరిగింది. మంత్రి సురేఖ,ఆమె భర్తకొండా మురళి పార్టి నేతలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కోరారు.
ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించక పోయినా పార్టి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు.
ముఖ్యమంత్రి తనకు అన్న లాంటి వాడని తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని క్షమాపణలు కోరడంతో వివాదం సద్దు మనిగింది.
అలాగే, ప్రభుత్వ ఫైల్స్ కదలాలంటే లంచాలు ఇవ్వాలని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఇది కాంట్రాక్టులు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అంశాల్లో ఆమెను వివాదాల్లోకి లాగింది.
మేడారం జాతర పనుల కాంట్రాక్టుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బాహాటంగా ఆరోపణలు చేసారు. దాంతో దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికి మంత్రి సురేఖను పక్కన పెట్టి అన్ని పనులు మంత్రులుసీతక్క,పొంగులేటికి అప్పచెప్పారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని పార్టి అధిష్టానం గట్టిగా వారించినప్పటికి కొండా సురేఖ మరోసారి పబ్లిక్ గా వేలి ముద్రగాళ్లు ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మెదక్ జిల్లా ములుగు లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 10వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్న కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాజకీయ నేతలు మరియు అధికారుల మధ్య తేడాను వివరిస్తూ “మేము రాజకీయ నేతలం. రాజకీయాల్లో వేలి ముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు. మాకు చదువు రాదు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్, ఐపీఎస్‌లు కాలేరు. ఎంతో కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయినా.. చివరికి మేం చెప్పింది వినాల్సి వస్తుంది” అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు “వేలి ముద్రగాళ్ళు” అంటే నిరక్షరాస్యులు లేదా సామాన్యులు (అనగా, చదువు లేకుండా కేవలం ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇవ్వగలిగిన వారు) కూడా ముఖ్యమంత్రులు అవుతారని అవమాన కరంగా మాట్లాడటం భాద్యతాయుత మంత్రిపదవిలో ఉన్న కొండుసురేఖకు ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన ఉద్దేశించే చేసారని బిఆర్ఎస్ నేతలు ఇంకా బాగా వైరల్ చేస్తున్నారు. తనవ్యాఖ్యలు తప్పుగా అర్దం చేసుకోవద్దని రికార్డు చేయవద్దని మంత్రి అదే సమావేశంలో అంటూనే ఇలా మాట్లాడినప్పటికి మీడియా ఊరుకోదుకదా…తప్పుడు సంకేతాలకు అస్కారం ఇచ్చేవిదంగా ఉన్న మంత్రివ్యాఖ్యలు దుమారం లేపాయి.
ఈకొత్త వివాదం నుండి మంత్రిసురేఖ ఎలా బయట పడతారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది.


Very interesting information!Perfect just what I was searching for!
Không chỉ nổi bật về bảo mật, game xn88 còn được đánh giá cao nhờ dịch vụ hỗ trợ khách hàng chuyên nghiệp 24/7. Mọi thắc mắc về đăng ký, nạp rút hay khuyến mãi đều được giải đáp nhanh chóng qua live chat. TONY03-27O