Headlines

పూలే ఆశయ సాధనలో న్యాయవాదులు ముందుండాలి

ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్

ఐ ఎల్ పి ఎ ఆధ్వర్యంలో పూలే 136 వ వర్ధంతి

రాష్ట్ర నాయకులు లడే రమేష్, జన్ను ఆనంద్ కు సన్మానం

 విద్యతోనే సామాజిక న్యాయం, మహిళా అభివృద్ధి జరిగి బానిసత్వం లేని  సమాజం నిర్మితమై సమానత్వ సమాజం ఏర్పడుతుందని బోధించి ఆచరణాత్మక ఉద్యమం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో న్యాయవాదులు ముందుండాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ అన్నారు. ఐ ఎల్ పి ఎ వరంగల్, హనుమకొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 136 వ వర్ధంతి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. పూలే త్యాగపూరిత పోరాటం వల్ల అణగారిన వర్గాల వేల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడని, సగబాగమైన మహిళలకు విద్యతో పాటు అణగారిన వర్గాలకు విద్యానందించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల మధ్య రక్త సంబంధాల చరిత్రను బోధించి మూలవాసి ప్రజల ఐక్యతకు కృషి చేశారని అన్నారు. పూలే అందించిన విద్య ఆయుధంతో పాటు అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో దేశంలోని బహుజన ప్రజలను చైతన్యం చేసి సామాజిక న్యాయం సాధించాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులై, సామాజిక అణచివేతపై అవగాహన కలిగిన న్యాయవాదులను చైతన్యం చేయడం ద్వారానే భారతదేశ మూలవాసి సమాజం చైతన్యం చెందుతుందని అన్నారు. 
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సిద్ధాంత వెలుగులో సాగుతున్న ఐ ఎల్ పి ఎ ను బలోపేతం చేయడంలో వరంగల్ జిల్లా న్యాయవాద నాయకులు ముందున్నారని, ఇటీవల వరంగల్ లో జరిగిన ఐ ఎల్ పి ఎ రాష్ట్ర 6వ సదస్సును మహిళలు, యువ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని, ఆ సదస్సులో పాల్గొన్న న్యాయవాదులను గమనిస్తే భవిషత్ తరాల భవితవ్యంలో ఐ ఎల్ పి ఎ పాత్ర కీలకమని అవగతమవుతుందని అన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటి తరుపున కృతజ్ఞతలు తెలిపారు. 
సభాధ్యక్షత వహించిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వేల ఏండ్ల నుండి పుక్కిటి పురాణాలతో ప్రజలను వంచిస్తున్న దోపిడి కులాలు 80 ఏండ్ల స్వాతంత్ర దేశంలో కూడా అణగారిన వర్గాల ఓట్లతో గద్దెనెక్కి బహుజన సమాజాన్ని తీవ్రంగా అణచివేస్తున్నారని అన్నారు. ఓట్లు మనవి అయినప్పుడు సీట్లు, రాజ్యాధికారం మనదే కావాలని ఓట్ల చైతన్యం దిశగా ఐ ఎల్ పి ఎ కార్యక్రమాలు కొనసాగుతాయని, మొదట న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం సాధించి తర్వాత దేశంలోని ఇతర రంగాల్లో న్యాయమైన వాటా కోసం ఐ ఎల్ పి ఎ పోరాటం చేస్తుందని అన్నారు. 

రాష్ట్ర నాయకులకు సన్మానం

ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్ర సదస్సు జయప్రదం అవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నలుగురిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. వరంగల్ బార్ నుండి అబ్దుల్ నభి, జన్ను ఆనంద్ కుమార్, హనుమకొండ బార్ నుండి లడె రమేష్, మహబూబాబాద్ నుండి వాసం ఆనంద్ కుమార్ లను రాష్ట్ర కమిటీలోకి తీసుకోగా శనివారం జరిగిన పూలే వర్ధంతి కార్యక్రమంలో లడె రమేష్, జన్ను ఆనంద్ కుమార్ లను రెండు జిల్లాల ఐ ఎల్ పి ఎ నాయకత్వం శాలువాలు కప్పు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ నమ్మకంతో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్, తీగల జీవన్ గౌడ్, చిల్ల రాజేంద్ర ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతగా పని చేసి ఐ ఎల్ పి ఎ బలోపేతానికి, న్యాయ వ్యవస్థలో బహుజన శక్తిని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. వీరికి రాష్ట్ర, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు. 
ఈ కార్యక్రమానికి ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ గౌడ్ స్వాగతం పలుకగా, ప్రధాన కార్యదర్శి గురిమిల్ల రాజు వందన సమర్పణ చేశారు. రాష్ట్ర, జిల్లా నాయకులు జన్ను పద్మ, అనుమాండ్ల రాజ్ కుమార్, పెండ్యాల అనిల్ కుమార్, బండారి కవిత, రాచర్ల సురేష్, ఎలమాద్రి రవి, పోతన సంధ్యారాణి, కె నిర్మల జ్యోతి,  జన్ను ప్రభాకర్, దండు మోహన్, కర్రు పావని, హరి కుమార్, అషిక పావని, లక్క చంద్ర శేఖర్, నీరటి శ్రీపతి కుమార్, రాకేష్ తదితరులు హాజరయ్యారు.
Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం