వరంగల్, 28,2025:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్నాల పవన్ కుమార్‌కు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పవన్ కుమార్ “డ్యువల్ గేట్ టన్నెల్ ఎఫ్ఎటీల ఆధారంగా తక్కువ విద్యుత్ వినియోగంతో డిజిటల్ సర్క్యూట్‌ల రూపకల్పన” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన ప్రొఫెసర్ కె.శివాని (హెడ్, ఈసీఐఈ విభాగం, KITS వరంగల్) మార్గదర్శకత్వంలో పూర్తయింది.

పవన్ కుమార్ హోమోజీనస్ మరియు హెటరోజీనస్ డ్యువల్ గేట్ TFET మోడళ్లను రూపొందించి, జిర్కోనియం డయాక్సైడ్, టాంటలమ్ పెంటాక్సైడ్ (Ta₂O₅) వంటి వివిధ ఆక్సైడ్ పదార్థాలతో సిమ్యులేషన్లు నిర్వహించారు.

ఆయన ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ మరియు కాన్ఫరెన్సుల్లో 12 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు, KITS చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత్ రావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే & కెఐటీఎస్‌వి అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ మరియు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డి పవన్ కుమార్ ను అభినందించారు.
డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ వి. వెంకటేశ్వర రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అలాగే డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారి పవన్ కుమార్‌కు పీహెచ్‌డీ డిగ్రీ లభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

