జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు వారం రోజుల్లో పూర్తి చేయాలి
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 20, 2026: జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వారం రోజులలోగా పూర్తి చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక జిల్లా ప్రజా సంబంధాల అధికారులకు (డి.పి.ఆర్.ఓ.) ఆదేశించారు.
శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానాలపై డి.పి.ఆర్.ఓలు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ కమీషనర్ మాట్లాడుతూ, జి.ఓ. నెం.252, 103లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలిసి జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నమోదు ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన, నివేదికల సమర్పణ, ఆమోదిత జాబితాల తయారీ, రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపు, కార్డుల డౌన్‌లోడింగ్ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అక్రిడిటేషన్ ప్రక్రియలో ఆన్‌లైన్ లేదా సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా రిలేషన్ విభాగంతో సంప్రదించాలని సూచించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి టెక్నికల్ టీమ్ అందుబాటులో ఉంటుందని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అక్రిడిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని డి.పి.ఆర్.ఓలను కోరారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ వెంటనే స్పెషల్ కమీషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల డి.పి.ఆర్.ఓలు, సంబంధిత సిబ్బంది ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల ఆన్‌లైన్ విధానంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. శిక్షణలో లేవనెత్తిన సందేహాలకు మీడియా రిలేషన్ విభాగం అధికారులు డి.ఎస్. జగన్, యామిని, వెబ్‌సైట్ టీమ్ మేనేజర్ నంద, టెక్నీషియన్ సాయిలు సమాధానాలు అందించారు.
అర్హత గల జర్నలిస్టులు http://ipr.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9154170881ను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస్, రమణ, మధుసుదన్, వై. వెంకటేశ్వర్లు, హష్మీ, రాజారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.


Việc sắp xếp các danh mục trò chơi tại slot365 com rất logic, giúp người mới dễ dàng tìm thấy trò chơi yêu thích chỉ trong vài giây. TONY03-18O
Giao diện rút tiền XN88 tối ưu cho cả PC và mobile – chơi slot mượt mà dù bạn đang dùng điện thoại hay máy tính bảng. TONY03-18H
It’s perfect time to make some plans for the future and it is time to be happy. I have read this post and if I could I want to suggest you some interesting things or suggestions. Perhaps you can write next articles referring to this article. I want to read more things about it!