ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 20 న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర మహాసభకు న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ పిలుపునిచ్చారు.
బుధవారం వరంగల్ జిల్లా కోర్టు ముందు ఐ ఎల్ పి ఎ మహాసభ గోడ పత్రికలను విడుదల చేసి ఆయన మాట్లాడారు.
80 ఏండ్ల స్వతంత్ర భారతం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతుందని, ఆ అభివృధి కొద్దిమందికే పరిమితమై మెజార్టీ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ప్రజల మధ్య మరింత అసమానతలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి తెలిసిన న్యాయవాదులు సమసమాజ స్థాపనలో ముందుండాలని అన్నారు. న్యాయవాదుల రక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే ఐ ఎల్ పి ఎ న్యాయవాదులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ చూపిన ఉద్యమ బాటలో న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే సామాజిక అసమానతలు తొలిగించే పోరాటంలో, సమాజ పరివర్తన కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న పోరాటంలో న్యాయవాదులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఎదిగిన వారు ఎదగని సమాజాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే సమానత్వం రావడం లేదని, అంబేద్కర్ చూపిన పే బ్యాక్ టు సొసైటీ మార్గంలో న్యాయవాదులు పయనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 న కొత్తగూడెంలో జరుగు రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఓబీసీ లకు ఎందుకు, మహిళా కోటాలో బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై జరుగు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ హై కోర్టు జడ్జి, మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశిష్ట అతిథులుగా కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి టి చిరంజీవులు, కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటేz ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, సామాజిక ఉద్యమకారులు సుభాష్ చంద్రబోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు హారవుతారని తెలిపారు. ఇట్టి సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు తీగల జీవన్ గౌడ్, చిల్లా రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా కన్వీనర్ విలాసాగరం సురేందర్ గౌడ్, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమాకాంత్, న్యాయవాదులు అంబరీషరావు, విద్యాదరరాజు, సూరం నరసింహ, విజేందర్ పటేల్, రంజిత్ గౌడ్, కె నిర్మలా జ్యోతి, శ్రీలత, ప్రవీణ, జన్ను పద్మ, పూస రవీందర్, రమేష్, కొంగర పూర్ణచందర్, జన్ను ప్రభాకర్, దేవులపల్లి శ్రీకాంత్, ముత్యాలరావు, ఆనంద్, సాంబశివరాజు, జి ఆర్ శ్రీనివాస్, ఎగ్గడి సుందర్ రామ్, సాయి పవన్, నీలిమ, అస్లాం, తదితరులు పాల్గొన్నారు


Awsome post and right to the point. I don’t know if this is in fact the best place to ask but do you guys have any thoughts on where to hire some professional writers? Thanks in advance 🙂