ఓ యుద్దోన్మాధులారా…సిగ్గుపడిండి…
బాషెం జనేహ్, నెగెవ్ ఎడారి, దక్షిణ ఇజ్రాయెల్ : యుద్దోన్మాదుల కారణంగా ప్రపంచ యుద్దాలు జరిగాయి. ఎప్పుడూఎక్కడో ఓ చోట వీరికాారణంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ లో ఓవ్యక్తి తనకుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓపాతబస్సును బంకర్ గా మార్చుకున్న తీరు ప్రపంచాన్ని ఆలోచింప చేస్తోంది.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారిలో ఉన్న బాషెం జనేహ్ నివాసి అహ్మద్ అబు ఘనిమా, కొనసాగుతున్న క్షిపణి దాడుల నుండి రక్షించుకోవడానికి ఒక పాత మినీబస్సును అద్భుతంగా సృజనాత్మకంగా బంకర్ గా మార్చాడు. పేదరికం ఆవిష్కరణకు అడ్డుకాదన్న వాస్తవాన్ని అతను రుజువుచేసాడు.
శత్రు దేశాల క్షిపణి దాడుల నిరంతర ముప్పును ఎదుర్కొంటూ, అబు ఘనిమా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తనదైన పద్ధతిలో ఆలోచనలకు పదును పెట్టి రంగంలోకి దిగాడు. అతను ఒక పెద్ద గుంతను తవ్వి, అందులో పాత మినీబస్సును పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత దానిపై మట్టిని ఎత్తుగా నింపి, ఆ వాహనాన్ని పటిష్టమైన, భూగర్భ ఆశ్రయంగా మార్చాడు. ఇప్పుడు ఒకే కిటికీ అతని కుటుంబ సభ్యులకు లోపలికి, బయటికి వెళ్ళే మార్గంగా ఉంది. ఇది చాలా వరకు తనకుతనకుటుంబసభ్యులకు రక్షణగా ఉంటుందని వారిని ప్రమాదం భారిన పడకుండా ప్రత్యేకమైన సురక్షితమైన ఆశ్రయాన్ని అందిస్తుందని అన్నారు.
సంక్షోభ సమయంలో అబు ఘనిమా ఈ తెలివైన పరిష్కారం తమ కుటుంబాలను రక్షించుకోవడానికి పడిన తపన ప్రపంచాన్ని ఆలోనలో పడేసింది. ఈయుద్దోన్మాదం ఎవరాపాలి. మారణ హోమాలు ఎందుకుె వరికోసం జరుగుతున్నాయి ..ఎవరు మొదలుపెట్టారుఎవరుకొనసాగిస్తున్నారు…ఏ ఆశించి యుద్దాలకు దిగుతున్నారు…వంటి అంశాలు ప్రశ్నార్దకంగా మిగిలాయి.
సేవ్ ఫ్రమ్ వార్…