మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు ఇందిరమ్మ ఇండ్లు పథకం క్రింద రూ.1,00,000 మంజూరు పొందేందుకు సంబంధించి, “ఇంటి బేస్‌మెంట్ ఫోటోలు తీసి, నిర్మాణ దశల పురోగతిని యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి” అధికారిక సహాయం పేరుతో కార్యదర్శి రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను అశ్రాయించాడు. గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికాడు.
“ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని నుండి లంచం తీసుకుంటూఎసీబీకి దొరికిన గ్రామ పంచాయితీ కార్యదర్శి
