లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన నిజామాబాద్ మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్

 

నిజామాబాద్ నగరంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కర్ణ శ్రీనివాస్‌రావు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చిక్కాడు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుని వి.ఎల్.టి. ఫైల్ ప్రాసెస్ చేసి నంబర్ కేటాయించడంలో సహాయం చేస్తానని, అలాగే భవిష్యత్తులో దుకాణం సజావుగా నడిచేలా చూసుకుంటానని హామీ ఇస్తూ, రూ.10,000 లంచం డిమాండ్ చేసాడు. చివరికి అభ్యర్థన మేరకు రూ.7,000 అంగీకరించి లంచం తీసుకుంటున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
ప్రజలకు ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని సూచించారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్‌ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

Share this post

9 thoughts on “లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన నిజామాబాద్ మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్

  1. Magnificent beat ! I wish to apprentice while you amend your website, how can i subscribe for a blog website? The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear idea

  2. I’m not sure exactly why but this weblog is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a issue on my end? I’ll check back later and see if the problem still exists.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం