డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కు సన్మానం

విద్యా వేత్తలు రాజకీయాల్లోకి రావాలి

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

 విద్యా వేత్తలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే భారతదేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. బహుజన ఉద్యమకారుడు డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగాధిపతిగా నియామకం అయిన సందర్భంగా ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన చింతం ప్రవీణ్ కుమార్ కు సన్మానం చేసి ఆయన మాట్లాడారు. చిన్న వయసు నుండే పేదరికంతో పోరాడి ఉన్నత చదువులు చదివి విద్యతో పాటు సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రవీణ్ కుమార్ రచయితగా, కవిగా ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచి కాకతీయ యూనివర్సిటీలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఆర్ట్స్ కాలేజ్ తెలుగు విభాగానికి విభాగాధిపతిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రజలను చైతన్యం చేసి విలువల రాజకీయ నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు బుసగొండ ఓంకార్, బీసీ జాతీయ నాయకుడు చాపర్తి కుమార్ గాడ్గే, ఆలిండియా ఓబీసీ జాక్ వైస్ ప్రెసిడెంట్ లు వల్లాల జగన్ గౌడ్, రాసమల్ల శ్రీనివాస్ సగర, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్ సగర, ఆకారపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this post

4 thoughts on “డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కు సన్మానం

  1. nhà cái 188v Trên các bảng xếp hạng uy tín như AskGamblers và iGamingTracker, nhà cái thường xuyên góp mặt trong danh sách những nhà cái có tỷ lệ giữ chân người chơi cao nhất.

  2. nhà cái 188v Trên các bảng xếp hạng uy tín như AskGamblers và iGamingTracker, nhà cái thường xuyên góp mặt trong danh sách những nhà cái có tỷ lệ giữ chân người chơi cao nhất.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన