Headlines

ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా ఎడవెళ్లి సత్యనారాయణ రెడ్డి

హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా సీనియర్ న్యాయవాది ఎడవల్లి సత్యనారాయణరెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు హనుమకొండ జిల్లాలోని భూసంస్కరణల ప్రత్యేక కోర్టు మరియు మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదిస్తారని పేర్కొన్నారు. ఈ బాధ్యతల్లో వీరు మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారన్నారు. హనుమకొండ పట్టణానికి చెందిన న్యాయవాది సత్యనారాయణ రెడ్డి గత 35 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాలోని సీనియర్ క్రిమినల్ లాయర్ అర్శనపల్లి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్ గా తన వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించిన సత్యనారాయణ రెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను నాలుగవ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను తన సేవలు అందించారు. తన నియామకానికి సహకరించిన వరంగల్ పచ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో అంకితభావంతో పని చేస్తున్న నా సేవలను గుర్తించి, నన్ను గౌరవించి నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్ పదవిని సవ్యంగా నిర్వహించి ప్రభుత్వం తరపున వాదించి కేసుల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేస్తానాని తెలిపారు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్లీడర్లు

 హనుమకొండ జిల్లాకు జిల్లా భూసంస్కరణల ప్రత్యేక కోర్టు కమ్ మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా నియామకమైన ఎడవెల్లి సత్యనారాయణ, హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్లీడర్ కె నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మొక్క బహుకరణ

హనుమకొండ జిల్లాకు ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్ గా నియామకమైన ఎడవెల్లి సత్యనారాయణ సోమవారం వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో  ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు. ఆయనతో పాటు న్యాయవాదులు చింత నిఖిల్ కుమార్, సాయిని నరేందర్ పాల్గొన్నారు. 

ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ గా నియమితులైన సత్యనారాయణ రెడ్డికి హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్లీడర్ కె నర్సింహారావు,  హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పులి సత్యనారాయణ, కొత్త రవికుమార్, వరంగల్ బార్ అధ్యక్ష, కార్యదర్శులు వలస సుధీర్ కుమార్, రమాకాంత్, సీనియర్ న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, ముద్దసాని సహోదర్ రెడ్డి, వై శ్యామ్ సుందర్ రెడ్డి, మంగినపల్లి సదాశివుడు, బి వి శ్రీపతిరావు, సారంపెల్లి మధుసూదన్ రెడ్డి, సి హెచ్ రవీందర్ రెడ్డి,  మహమూద్, జి విద్యాసాగర్ రెడ్డి, చిల్ల రాజేంద్రప్రసాద్, నబీ, తీగల జీవన్ కుమార్, అంబరీష్ రావు, వేముగంటి బాలకిషన్ రావు, బత్తిని రమేష్ గౌడ్, రమణమూర్తి, బోయినపల్లి సోమేశ్వర్ రావు, టి రవీందర్ రావు, లడె రమేష్, నోముల నరేందర్, దయాన్ శ్రీనివాస్, పోతరాజు రవి, జి మురళీ కృష్ణ, కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు తొగరు జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తోట రాజ్ కుమార్, శేఖర్ రావు, ముధుసర్, కూనూరు రంజిత్ గౌడ్, ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్, సురేందర్ గౌడ్, ముచ్చు రాజేందర్, శ్రీనివాస్, బండి మొగిలి, అనిల్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్, నూనావత్ రమేష్, మంద విజేందర్ బార్ అసోసియేషన్ నాయకులు చింత నిఖిల్ కుమార్, అంబేద్కర్, చింత సాంబశివరావు, సి మల్లేష్, న్యాయవాదులు వలబోజు కేశవ్, పరమాత్మ, రాహుల్, ఇజ్జగిరి చంద్ర శేఖర్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, రాచకొండ ప్రవీణ్ కుమార్, బొమ్మ నాగరాజు, భవాని ప్రసాద్, జె జె స్వామి, గంధం శివ, గురిమిల్ల రాజు, గోపికరాణి జన్ను పద్మ, ఆరేపెల్లి త్రివేణి, అడ్లూరి పద్మ, జన్ను ప్రభాకర్, మిరియాల వేణు పటేల్, వలిఉల్లా ఖాద్రీ, మాజీ కార్పొరేటర్ అబూబకర్ తదితరులు అభినందనలు తెలిపారు.
Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE