సమ్మక్క సారలమ్మ జాతరతెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక


ప్రపంచానికి జాతరను పరిచయం చేస్తాం.

జాతర కోసం 251 కోట్లు వేచిస్తున్నాం.

15 కల్లా జాతర పనులు పూర్తి.

మేడారం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.


ఎస్.ఎస్.తాడ్వాయి మండలం.
ములుగు జిల్లా:

సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్ల పై సమీక్షించి తదుపరి మీడియా తో మాట్లాడారు.
ఆతరువాత అమ్మవారులను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 251 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం 150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను 101 కోట్లు విచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశాం, పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. గతం లో జాతర నిర్వహణకు 75 కోట్లు, 100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం 251 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతర ను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారానికి ఈ రోజు ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వాహనాల రాక మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. మేడారం జాతర పనులపై తాను అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జాతర సమయంలో ప్రజల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రౌడ్‌ కంట్రోల్‌కు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మేడారం జాతరను కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేడారం జాతర తెలంగాణ గుండె చప్పుడుగా, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జాతరకు సంబంధించిన నిధులు, అవసరమైన సామగ్రి అన్నింటినీ తక్షణమే మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్‌ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాతర పర్యవేక్షణ కోసం రూ.150 కోట్లను విడుదల చేశామని, ఇందులో దేవాలయానికి మాత్రమే రూ.101 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మేడారం మహాజాతరను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

మేడారం జాతర పనులపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష.

మేడారం మాస్టర్‌ ప్లాన్‌తో దర్శన సామర్థ్యం పెంపు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేడారం జాతర పనుల పురోగతిపై ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడారంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ టీఎస్ దివాకర తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన కొన్ని పనులు స్వల్పంగా మిగిలి ఉన్నప్పటికీ, నిత్యం భక్తుల రద్దీ దృష్ట్యా కొంత ఆలస్యం అయినా నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మేడారం మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మేడారం ప్రాంతాన్ని పూర్తిగా కోర్‌ ఏరియా, పెరిఫెరల్‌ ఏరియాలుగా విభజించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కోర్‌ ఏరియాలో కేవలం దేవాలయ ప్రాంతం మాత్రమే ఉండేలా రూపకల్పన చేశామని చెప్పారు. గత జాతరలో కోర్‌ ఏరియా విస్తీర్ణం సుమారు 32 వేల చదరపు అడుగులు ఉండగా, ఈసారి దాన్ని 54 వేల చదరపు అడుగులకు పెంచినట్లు వివరించారు.

గతంలో ఒకేసారి సుమారు 3 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి ఒకేసారి 8 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. మేడారం జాతర లైవ్‌ కవరేజ్‌కు అనుకూలంగా నాలుగు మీడియా వాచ్‌ టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గద్దెల ప్రాకారాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందిస్తూ మొత్తం 8 గేట్లను నిర్మించామని, ప్రాకార గోడలపై ఆదివాసీ జీవనశైలి ప్రతిబింబించేలా ప్రత్యేక శిల్పాలను చెక్కినట్లు కలెక్టర్‌ సమీక్ష సమావేశంలో వివరించారు. జాతర ఏర్పాట్లన్నీ సంప్రదాయాలకు భంగం కలగకుండా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు అధికారులు మంత్రులకు వివరించారు.
అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ శాఖ పనులను నిర్దిష్ట గడువులోగా అన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జాతర క్యూ లైన్లకు సంబంధించిన పనుల పురోగతిని ఈఈ పంచాయతీ రాజ్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రెండు క్యూ లైన్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రాకారం మరియు క్యూ లైన్‌ మధ్య సుమారు 12 అడుగుల లోతు వ్యత్యాసం ఉన్న ప్రాంతాలను మట్టితో నింపి ఈ నెల 15లోపు పూర్తి చేస్తామని తెలిపారు. క్యూ లైన్‌ల కోసం మొత్తం 1,086 రైలింగ్‌ ఫ్యాబ్రికేషన్‌ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
దేవాలయ పరిసరాల్లో ల్యాండ్‌స్కేపింగ్‌ పనులపై జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరణ ఇచ్చారు. ఆలయం వెనుక భాగంలో ఒక భాగం పనులు పూర్తయ్యాయని, మరో ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు మంత్రికి వివరించారు. రెండు సబ్‌ స్టేషన్ల నుంచి మేడారానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, షార్ట్‌ సర్క్యూట్‌లు, విద్యుత్‌ చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
పారిశుద్ధ్య పనులపై డీపీఓ
నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, కుంభమేళాను ఉదాహరణగా తీసుకుని అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలను మేడారంలోనూ అనుసరించాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
రవాణా ఏర్పాట్లపై ఆర్‌టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని తెలిపారు. గత జాతరలో సుమారు 16 లక్షల మంది భక్తులు ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు బస్సుల్లో జాతరకు రానున్నట్లు అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ప్రజారోగ్యంపై ములుగు జిల్లా డీఎంహెచ్‌వో శాఖ పనులను వివరించారు. గద్దెల సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, అలాగే 30 పిరిఫెరల్‌ హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా ‘108’ అంబులెన్స్‌ 30 అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, 24×7 స్పెషలిస్ట్‌ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

పోలీస్‌ శాఖ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకన్ వివరాలు వెల్లడించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. 480 సీసీ కెమెరాలు, 20 డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశామని, నేర నియంత్రణ కోసం పొరుగు జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను కూడా మోహరించినట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. దేవాలయ లైటింగ్‌కు సంబంధించి, టీటీడీలో పని చేసిన అనుభవం కలిగిన ప్రత్యేక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. లైటింగ్‌ ప్రోటోటైప్‌ను మంత్రులకు ప్రదర్శించగా, లైటింగ్‌ పూర్తిగా ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారానికి ఈ రోజు ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వాహనాల రాక మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. మేడారం జాతర పనులపై తాను అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జాతర సమయంలో ప్రజల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రౌడ్‌ కంట్రోల్‌కు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మేడారం జాతరను కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేడారం జాతర తెలంగాణ గుండె చప్పుడుగా, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జాతరకు సంబంధించిన నిధులు, అవసరమైన సామగ్రి అన్నింటినీ తక్షణమే మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నట్లు వెల్లడించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాతర పర్యవేక్షణ కోసం రూ.150 కోట్లను విడుదల చేశామని, ఇందులో దేవాలయానికి మాత్రమే రూ.101 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మేడారం మహాజాతరను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్‌ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్‌ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share this post

3 thoughts on “సమ్మక్క సారలమ్మ జాతరతెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక

  1. I precisely wanted to thank you so much all over again. I do not know the things I would’ve accomplished in the absence of the entire strategies provided by you regarding such field. Entirely was a traumatic dilemma in my position, however , being able to view the very skilled tactic you dealt with that forced me to cry for delight. Now i am happy for this support as well as hope that you realize what a great job you are providing training the rest all through your web blog. Probably you have never met any of us.

  2. deegarciaradio.com trở thành địa điểm giải trí trực tuyến hàng đầu của rất nhiều hội viên trong giới cá cược online bởi mang lại thế giới săn thưởng sự mới mẻ, đặc sắc. nhà cái xn88 Anh em khi tham gia sẽ được trải nghiệm từng cung bậc cảm xúc khác nhau. TONY04-27H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం