కిట్స్‌ వరంగల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు


వరంగల్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కిట్స్‌ వరంగల్‌ (కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌) ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, మహిళా సాధికారత, విద్యార్థుల ఐక్యతను చాటేలా ఈ వేడుకలు జరిగాయి.
కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోకరెడ్డి మార్గదర్శకత్వంలో మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (MDF) క్లబ్‌, స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (SAC), మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా కళాశాల క్రీడా మైదానంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోకరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. పూలతో బతుకమ్మలను అలంకరించడం ప్రకృతిపై ప్రేమను, ఐక్యతను, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రకృతితో మానవ సంబంధాన్ని చాటిచెప్పే పర్యావరణహిత పండుగగా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
విద్యార్థులు వివిధ రకాల రంగురంగుల పూలను తీసుకువచ్చి అందంగా బతుకమ్మలను పేర్చారు. అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
మాజీ రాజ్యసభ సభ్యుడు, కిట్స్‌ చైర్మన్‌ కెప్టెన్‌ వి. లక్ష్మీకాంతరావు, కళాశాల కోశాధికారి పి. నారాయణరెడ్డి, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, కిట్స్‌ అదనపు కార్యదర్శి వొడితల సతీష్‌కుమార్‌ ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన మహిళా అధ్యాపకులు, MDF క్లబ్‌ విద్యార్థి బృందాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కె. శ్రీధర్‌, మహిళా సాధికారత విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ కె. సౌజన్య, కన్వీనర్‌ వి. గౌతమి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పీఆర్వో డాక్టర్‌ డి. ప్రభాకరచారి, అధ్యాపక సమన్వయకర్తలు డాక్టర్‌ పి.ఎస్‌.ఎస్‌. మూర్తి, డాక్టర్‌ కె. శైలజ, సాహితీ క్లబ్‌ అధ్యాపక సమన్వయకర్త డాక్టర్‌ గ్రేస్‌ శాంతి పాల్గొన్నారు.
MDF క్లబ్‌ అధ్యక్షురాలు ఎ. దివ్య, PMC అధ్యక్షుడు ఎన్‌. అక్షయ్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, 500 మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం