చెర్రీ..దాటేసాడు బౌండరీ!

చెర్రీ..దాటేసాడు బౌండరీ!

ముగ్గురు తండ్రుల
కళ్ళ ముందు పెరిగిన కుర్రాడు.

ముగ్గురూ నటిస్తుంటే..
చూస్తూ ప్రేరణ పొందిన బుడతడు..

నాన్నేమో మెగాస్టార్..
బాబాయి పవర్ స్టార్..
పరిశ్రమకు రావడంతోనే..
ఆమాటకొస్తే రాక మునుపే ఫ్యామిలీ ఫ్యాన్స్
ఆ ఇద్దరు స్టార్ల మీద అభిమానంతో ఇద్దరి
బిరుదాలను కలిపి
“మెగాపవర్ స్టార్” అనే కిరీటాన్ని అమరిస్తే
అమ్మో మోయగలనా అని సంశయిస్తూనే నాకేంటి.. నాన్న కీర్తికి..
బాబాయ్ స్ఫూర్తికి
తగ్గకుండా నవయుగా స్టార్ గా నాకంటూ ఒక కొత్త పేజీని
సృష్టించుకుంటానని తనలో
తనే అనుకుని..తనకు తానే సవాల్ చేసుకుని..
చిరుతలా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన చెర్రీ
ఈరోజున ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు..

రామ్ చరణ్..
మొదటి సినిమా యావరేజ్..
చెప్పాలంటే ఫ్లాప్..
అధైర్య పడలేదు.

ఆ వెంటనే మగధీర..
అదో రకం కథ..
దర్శకుడు రాజమౌళి..
కొట్టాడు మెగా హిట్..
అయినా ఈ చిరుతని
తండ్రి చిరుతో
పోలిక తెచ్చే పరిస్థితి లేదు..

కుర్రాడు ఆగలేదు..
ఆరెంజ్ నిరాశపరచినా..
సినిమాలు చేస్తూనే ఉన్నాడు..ఆ ప్రయాణంలో ప్లాపులు..హిట్లు రెండూ సమంగానే ఉన్నాయి..

అభిమానుల ఊపుతో..
నాన్న ప్రోత్సాహంతో
ముందుకు వెళ్తున్నాడే గాని..
మనసులో బలమైన కోరిక..
పెద్ద హిట్టు చెయ్యాలని..

ఈలోగా కుటుంబం నుంచే
బన్నీ అర్జున్ వచ్చి హిట్లు మీద హిట్లు కొడుతున్నా
ఆ పోటీని ఆరోగ్యకరమైన
ఫ్యామిలీ పోటీగానే తీసుకుని
తనదైన శైలిలో నాన్నని గాని..బాబాయిని గాని
అనుకరించకుండా..
జస్ట్ అనుసరిస్తూ
ముందుకు సాగాడు..

ఎలాంటి పాత్రయినా గాని..
సినిమా హిట్టు కొట్టాలి..
మంచి పేరు రావాలి..
అప్పుడు తగిలింది రంగస్థలం.
బాబు బాండ్ బజాయించాడు..
తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు..చెవిటి హీరో..
గ్లామర్ ఊసే లేని పాత్ర..
అవతల జగపతి బాబు..
అయినా తగ్గేదేలే అనుకున్నాడు..సుకుమార్ దర్శకత్వంలో సుకుమారమే
కనిపించని రోల్..
అదరగొట్టాడు..
ఒకరకంగా నాన్న చిరంజీవి కూడా చెయ్యని సాహసం..
కొట్టేశాడు సూపర్ హిట్టు..
మెగా ఫ్యామిలీ ప్రతిష్ఠ మీదొట్టు..!

ఆ తర్వాత..ఎదురొచ్చింది
ట్రిపుల్ ఆర్..ఇప్పుడు
నటనలో..నాట్యంలో
సరైన పోటీ అనుకున్నట్టు
జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్..ఇన్ఫీరియారిటీ
లేదు..సుపీరియారిటీ పెట్టుకోలేదు..ఇచ్చిన పాత్ర..
దర్శకుడు చెప్పిన విధంగా..
అభిమానులు కోరుకునే రీతిలో చేశాడు..
ఎన్టీఆర్..చరణ్ సమఉజ్జీలే
సుమా..ఇద్దరూ ఇద్దరే.. అన్న రీతిలో సూపర్ డూపర్ విజయం..

రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ కైతే వెళ్లిపోలేదు గాని..ఒక లెవెల్ కైతే చేరిపోయాడు…

వాట్ నెక్స్ట్..
ఇంకా పెద్ద హిట్టు కొట్టాలి..
మరింత భిన్నమైన
పాత్ర చెయ్యాలి..

అప్పుడు వచ్చాడు..
చానా చక్కటి కథతో
సానా బుచ్చిబాబు..

మన తెలుగు సినిమా ఇంతవరకు చూడని జోనర్..
మళ్ళీ నో గ్లామర్..
చెర్రీలో ఫైటర్
సై అన్నాడు..

కథ వినూత్నం..
టైటిల్ మరీ విభిన్నం..
పెద్ది..
పాత్ర చాలెంజింగ్..

ఈ సినిమా షూటింగ్
అలా షికారులా సాగిపోలేదు.
అడుగడుగునా సవాళ్లే..
రోజురోజుకీ ఇంప్రువైజేషనే..
మంచిదే అయింది ..చరణ్
తనను తాను మరింతగా సానబెట్టుకోడానికి
సానా మరింత అవకాశం ఇచ్చాడు..

కథ చాలా లోతైనది..నటనకు
పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర.
చరణ్ మంచి ఆకలి మీదున్నాడు..ఏం చెప్పినా అందుకున్నాడు..
ఎంత కావాలన్నా చేసి చూపించాడు.
కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నాడు..

మామూలుగా నేటి తరం హీరోలు చెయ్యడానికి
ఆలోచించే పాత్ర..
ఒప్పుకోవడానికి ఎంత ఆలోచించాడో గాని
అంగీకరించాక చించేసాడు..
జీవితకాలానికి సరిపడా
చేసి చూపించాడు..
అంతటి పెద్ద నటుడు
నాన్నే అచ్చెరువొందేలా..
అభిమానులు అబ్బురపడేలా
అభినయ పరాకాష్ట..
పాత్రకు ప్రాణం పోశాడు..
అభినయంలో తనను తాను
చక్కగా చెక్కుకున్నాడు.
తన కెరీర్ కు సాఫల్యం చేకూర్చుకున్నాడు..

నాన్నకి పుత్రోత్సాహం..
అభిమానులకు నవోత్సాహం..
నిర్మాతకు ఉత్సాహం..
ఈ పెద్ది ఆవాహం..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం