రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం -2025 తీసుకొచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ గారికి ధన్యవాదాలు
ప్రమాదం జరిగిన వారం రోజుల్లోపు ఒక్కో బాధితుడికి 1.5 లక్షల ఆర్థిక పరిమితి వరకు నగదు రహిత చికిత్స..
ఆయుష్మాన్ భారత్ PM – JAY కింద ఎంప్యానల్ అయిన ప్రతి ఆసుపత్రిలో పథకం వర్తింపు..
ప్రమాద సమాచారం పై పోలీసులు వెంటనే స్పందించాలి ప్రమాద వివరాలు E-DAR లో నమోదు చేయాలి.
రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పథకం పై ప్రతి పోలీస్ స్టేషన్ లో అవగాహన కల్పించాలి.
రవాణా శాఖ,పోలీస్ ,హెల్త్ అండ్ మెడికల్ , ఇన్సూరెన్సన్ , NIC లు రాష్ట్ర స్థాయి ,జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకోవాలి
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం అమలు పై సన్నాహక సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 162 ప్రకారం భారత ప్రభుత్వం “రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం, 2025″ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణ లో అమలు పై రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, NIC, విభాగాల అధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ పథకంలో ప్రధానమైన అంశాలు
రోడ్డు ప్రమాదాల బాధితులకు, వారి బీమా స్థితితో సంబంధం లేకుండా, ప్రమాదం జరిగిన మొదటి 7 రోజుల్లోపు, ఒక్కో బాధితుడికి 1.5 లక్షల ఆర్థిక పరిమితి వరకు తక్షణ మరియు నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఈ పథకం లక్ష్యం.ఈ పథకం వర్తించే వారు రోడ్డు ప్రమాద బాధితుడు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.ఆయుష్మాన్ భారత్ PM-JAY కింద ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించబడుతుంది.NHA ద్వారా నియమించబడిన ఇతర సౌకర్యాలు కలిగి ఉంటాయి. ప్రమాద బాధితుడి వివరాలు సజావుగా డేటా మార్పిడి కోసం e-DAR (ఎలక్ట్రానిక్ వివరణాత్మక ప్రమాద నివేదిక) మరియు TMS (లావాదేవీ నిర్వహణ వ్యవస్థ) ద్వారా అమలు చేయబడుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని సమీపంలోని నియమించబడిన ఆసుపత్రికి తీసుకువెళ్ళవచ్చు.e-DAR ID & TMS రోగి రిజిస్ట్రేషన్ ఎంటర్ చేస్తారు.అత్యవసర చికిత్స వెంటనే ప్రారంభమవుతుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ప్రమాదం గురించి 112 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితుడిని సమీపంలోని నియమించబడిన ఆసుపత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ పంపించబడుతుంది. అక్కడి నుండి బాధితుడిని నాన్-డిజిగ్నేటెడ్ ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందించబడుతుంది.తరువాత సమీపంలోని ఎన్ప్యానెల్ ఆసుపత్రికి బదిలీ చేయబడుతుంది.
మోటార్ వెహికిల్ ఆక్సిడెంట్ ఫండ్ నుండి ఈ క్లెయిమ్ అమౌంట్ సెటిల్ చేయబడుతుంది.బీమా చేయబడిన మరియు బీమా చేయని/”హిట్ అండ్ రన్” వాహనాలకు ప్రత్యేక ఖాతాలు ద్వారా క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.పోలీసులు రోడ్డు
ప్రమాద సమాచారం వస్తె వెంటనే స్పందించాలి.ప్రమాద వివరాలను e-DARలో నమోదు చేయాలి. e-DAR రోగి IDని రూపొందించి షేర్ చేయాలి.24 గంటల్లోపు ప్రమాద చట్టబద్ధతను ధృవీకరించాలి ప్రమాద ధృవీకరణ ఆధారంగా క్లెయిమ్ అర్హతను ఆమోదించాలి. ఆసుపత్రులు డబ్బులు చెల్లింపు తో సంబంధం లేకుండా తక్షణ చికిత్స అందించాలి.డిశ్చార్జ్ అయిన తర్వాత సంబంధిత రాష్ట్ర ఆరోగ్య సంస్థ (SHA)కి క్లెయిమ్ ఫారమ్‌లను సమర్పించాలి.ట్రాకింగ్ మరియు మ్యాపింగ్ కోసం e-DAR మరియు TMS వ్యవస్థలతో సహకరించాలి.జిల్లా స్థాయిలో అమలును జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్ పర్యవేక్షిస్తారు.పోలీసులు, ఆసుపత్రుల అత్యవసర సేవల మధ్య సమన్వయం చేసుకోవాలి.
ఆసుపత్రులు సమర్పించిన క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాలి.రాష్ట్ర మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీలు పథకం అమలు మరియు పనితీరును పర్యవేక్షించాలి. ఫిర్యాదులను జిల్లా స్థాయి ఫిర్యాదు అధికారికి దాఖలు చేయవచ్చు.రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల హెల్ప్‌లైన్: 14555 (NHA) కి చేయవచ్చు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరు చనిపోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిపై కింద స్థాయి పోలీస్ అధికారులకు ఇతర విభాగాల అధికారులకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం విజయవంతం కావడానికి రవాణా ,పోలీస్ ,హెల్త్ ,ఇన్సూరెన్స్ ,NIC విభాగాలు కలిసి జిల్లా ,రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇస్తే తమ మీద కేసులు అవుతాయనే భయం ఉండేదని అది అపోహ మాత్రమే అని తెలిపారు. ప్రమాదాలు జరగగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమీక్షా సమావేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ పథకం పై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్ ను ఆదేశించారు. మన జీవితంలో రోడ్డు ప్రమాదాల నుండి ఒక ప్రాణం రక్షించిన గొప్ప సంతృప్తి ఇస్తుందని ఇది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఇది సామాజిక బాధ్యతగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఈ పథకం పై సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. పేదల్లో పేదలను రక్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని విభాగాల అధికారులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
సమీక్షా సమావేశంలో డీజీపీ జితేందర్ ,అహ్మద్ నదీమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, క్రిస్టినా జడ్ చొంగ్తు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ,షాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటిసి లు ,యూనిసెఫ్ ,NIC ప్రతినిధులు ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


s713vz
frztou
hgh7yy
What i do not realize is if truth be told how you’re now not really a lot more neatly-appreciated than you may be now. You’re so intelligent. You recognize therefore significantly in relation to this subject, made me for my part consider it from so many various angles. Its like women and men are not fascinated unless it’s one thing to do with Lady gaga! Your personal stuffs outstanding. At all times maintain it up!