ప్రపంచ రికార్డు సాధించిన ఎపి సిఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశ్‌

nara devansh

గతేడాది జరిగిన చెక్‌మేట్ మారథాన్లో 175 చెక్‌మేట్ సవాళ్లను విజయవంతంగా పరిష్కరించి ఈ రికార్డు నెలకొల్పిన దేవాంశ్‌ ఇప్పటికే చెస్ డొమైన్‌లో రెండు రికార్డులు సాధించాడు.

ఈ విజయంపై తండ్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. “కేవలం 10 ఏళ్ల వయసులోనే ఒత్తిడిలో ప్రశాంతంగా ఆలోచించే తత్వం, అంకితభావం, ఎన్నో గంటల కఠోర శ్రమతో దేవాంశ్‌ సాధించిన విజయం ఎంతో గర్వకారణం” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలిపారు. “మా ఛాంపియన్‌కి శుభాకాంక్షలు. గురువుల మార్గదర్శకత్వంలో నెలల తరబడి సాధన చేసి సాధించిన ఈ విజయం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణం” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

శాప్ ఛైర్మన్‌ రవినాయుడు కూడా దేవాంశ్‌ను అభినందించారు. “తొమ్మిదేళ్ల వయసులోనే ఇంతటి రికార్డు సాధించడం అపూర్వం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి