అక్రెడిటేషన్స్ లో వ్యత్యాసాలు సరి చేయాలని ఆదేశాలు – మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో అక్రిడేషన్ల సమస్య, ఇళ్ల స్థలాలు విషయంపై ఖమ్మంలో జర్నలిస్టులతో మాట్లాడిన రాష్ట్ర రెవిన్యూ సమాచార గృహ నిర్మాణం శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్రంలో అక్రిడేషన్ల జారీలో పెద్ద పత్రికల్లో జరుగుతున్న వ్యత్యాసాలు, చిన్న మధ్య తరగతి పత్రికలకు జరుగుతున్న అన్యాయం, కేబుల్ టీవీ లకు గతంలో ఉన్న అక్రిడేషన్ కొనసాగించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే అక్కడి నుంచే రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడి అక్రిడేషన్ లో జరుగుతున్న వ్యత్యాసాలను పరిశీలించి సరిచేయాలని కోరారు.

ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించి వారికి తగినవిధంగా న్యాయం చేయాలని కోరగా అందుకు స్పందించిన మంత్రి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడి ముగ్గురు సీనియర్ ఐఏఎస్
అధికారుల తో ఖమ్మం జర్నలిస్టులతో సమావేశం ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరారు.

ఖమ్మంలో మంచి ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసుకుని వస్తే తాను తగిన విధంగా ఏర్పాటు చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రెస్ క్లబ్ ల నిర్వహణ విషయంలో కూడా గైడ్ లైన్స్ తయారు చేయాలని మంత్రి సమాచార శాఖ కమిషనర్ ఆదేశించారు..

Share this post

One thought on “అక్రెడిటేషన్స్ లో వ్యత్యాసాలు సరి చేయాలని ఆదేశాలు – మంత్రి పొంగులేటి

  1. Nice post. I was checking continuously this blog and I’m impressed! Extremely useful information specifically the last part 🙂 I care for such information much. I was seeking this particular information for a very long time. Thank you and best of luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం